Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు... ఆ విషయంలో చర్యలు తీసుకోవాలని...

యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌పై టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ క్రిశాంక్ సహా ఆ పార్టీకి చెందిన మరో ముగ్గురు సోషల్ మీడియా కన్వీనర్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ... చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. చట్టపరంగా మల్లన్నపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరినట్లు తెలిపారు. ఇకనైనా పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. పద్దతి మార్చుకోకపోతే తాము మల్లన్న కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుందన్నారు.మరో టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌పై నవీన్ అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

trs social media conveners lodged complaint at cyber crime against teenmar mallanna

మహారాష్ట్రలో కేంద్రమంత్రి నారాయణ్ రాణే అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో టీఆర్ఎస్ మద్దతుదారులు మల్లన్న టాపిక్‌ను లేవనెత్తారు. ఉద్దవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏకంగా కేంద్రమంత్రినే అరెస్ట్ చేశారని... ఇక్కడ మల్లన్న సీఎంను ఎన్నిసార్లు కించపరుస్తున్నా ఎందుకు ఉపేక్షిస్తున్నారని కొంతమంది ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం మల్లన్నపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

తీన్మార్ మల్లన్నపై గతంలోనూ పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తన యూట్యూబ్ ఛానెల్‌లో నిర్వహించే న్యూస్ షో ద్వారా మల్లన్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్‌లపై ఘాటైన విమర్శలు చేస్తుంటారు. ప్రభుత్వానికి భయపడేది లేదని ఆయన చాలాసార్లు సవాల్ విసిరారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ,వరంగల్,ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి రెండో స్థానానికి పరిమితమయ్యారు.

ఇటీవల చిలకా ప్రవీణ్ అనే జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నపై పలు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ ఆరోపణలు,విమర్శలను తిప్పి కొట్టే క్రమంలో మల్లన్న ఓ యువతిపై నిరాధారణ ఆరోపణలు చేశారనే విమర్శలు వచ్చాయి. దీనిపై ఆ యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మల్లన్నపై కేసు నమోదవగా... ప్రస్తుతం దానిపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మల్లన్న తెలంగాణలో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+