ఒక్క‌డిని నిలువ‌రించేందుకు ముగ్గురు మంత్రులు..! రేసుగుర్రంలా రెచ్చి పోయిన రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిని నిలువ‌రించేందుకు అదికార పార్టీ అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. రేవంత్ రెడ్డిని కొడంగ‌ల్ లో ఓడిస్తే గుండెల మీద ఉన్న కొండంత భారం త‌గ్గిన‌ట్టే అన్న భావ‌న‌లో ఉంది అదికార గులాబీ పార్టీ. అందుకోసం 119నియోజ‌క వ‌ర్గాల మీద కాకుండా ఒక్క కొడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గం పైనే టీఆర్ఎస్ పార్టీ ద్రుష్టి కేంద్రీక‌రించింది. కొడంగ‌ల్ లో అడ‌పాద‌డ‌పా అభివ్రుద్ది కార్య‌క్ర‌మాల‌తో హ‌డావిడి చేస్తున్న గులాబీ పార్టీ రెండు రోజుల క్రితం ప‌రాకాష్ట రాజ‌కీయాల‌కు తెర‌తీసింది.

ఒక్కరు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా ఆరుగురు మంత్రులు అభివ్రుద్ది కార్య‌క్ర‌మాల పేరుతో కొడంగ‌ల్ లో ప‌ర్య‌టించారు. అభివ్రుద్ది కార్య‌క్ర‌మాల పేరుతో రేవంత్ రెడ్డి అదిప‌త్యాన్ని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక ర‌చించింద‌ని గ్రామ‌స్తులు చ‌ర్చించుకున్న‌ట్టు స‌మాచారం. ఆరుగురు మంత్రులు ఏక‌కాలంలో కొడంగ‌ల్ లో ప‌ర్య‌టించిన‌ప్ప‌టికి రేవంత్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ ను ఆవ‌గింజ‌తైనా త‌గ్గించ‌లేక‌పాయార‌నే చ‌ర్చ కూడా తారా స్థాయిలో జ‌రుగుతోంది. ఒక ప‌క్క అభివ్రుద్ది మంత్రాన్ని జ‌పిస్తూ కొడంగ‌ల్ గ్రామ‌స్తుల‌కు గాలం వేస్తున్న మంత్రుల‌కు రేవంత్ రెడ్డి రేసుగుర్రంలా స‌మాధానం చెప్పిన‌ట్టు స‌మాచారం.

రేవంత్ ను అడ్డుకునేందుకు ఆరుగురు మంత్రులు..! రంగంలో దిగింది ముగ్గురు..!!

రేవంత్ ను అడ్డుకునేందుకు ఆరుగురు మంత్రులు..! రంగంలో దిగింది ముగ్గురు..!!

తెలంగాణా లో ప్ర‌తిప‌క్ష పార్టీ హోదాలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పైన అదికార పార్టీ ఆంక్ష‌లు విదించ‌డం స‌మంజ‌స‌మేనా...? తెలంగాణాలో ప్ర‌జ‌ల‌ మ‌ద్య‌కు వెళ్లి ప్ర‌భుత్వ విధానాల ప‌ట్ల చైత‌న్యం క‌లిగిస్తున్న రేవంత్ రెడ్డి ని నిలువరించాల‌నుకోవ‌డం గులాబీ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు స‌బ‌బేనా.? తెలంగాణాలో రేవంత్ ను నిలువ‌రించి నంత మాత్రాన రోజురోజుకూ ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వం పై పెరుగుతున్న వ్య‌తిరేక‌త అద్రుశ్య‌మైపోతుందా టీఆర్య‌స్ శ్రేణులే చెప్పాలి. క్షేత్ర స్థాయిలో ప్ర‌జ‌ల‌నుండి వ‌స్తున్న మార్పు ఎంత‌టి ప‌రిణామాల‌కు దారి తీస్తుందో గులాబీ ద‌ళాల‌కు తెలియంది కాదు. తెలంగాణ‌లో ఒక్క రేవంత్ రెడ్డి మీద ఫోక‌స్ పెట్టిన ప్ర‌భుత్వం అందుకు త‌గ్గ‌ట్టుగానే అష్ట‌దిగ్బంద‌నం చేసేందుకు పావులు క‌దుపుతోంది. ఒక్క రేవంత్ రెడ్డిని క‌ట్ట‌డిచేస్తే తెలంగాణ‌లో ప్ర‌భుత్వానికి ఎదురుండ‌ద‌నేది గులాబీ
నేత‌ల ప్లాన్ గా తెలుస్తోంది.

 నానా ప‌నింగ్ దా కూట్ట‌మా వ‌రూం..! సింగ‌మ్ సింగిల్ దా వ‌రూం..!! అంటున్న రేవంత్ రెడ్డి.

నానా ప‌నింగ్ దా కూట్ట‌మా వ‌రూం..! సింగ‌మ్ సింగిల్ దా వ‌రూం..!! అంటున్న రేవంత్ రెడ్డి.

తెలంగాణలో ఉన్న పవర్‌ఫుల్ లీడర్స్‌లో రేవంత్ రెడ్డి ఒకరు. విభజనకు ముందు చంద్రబాబుకు అండగా నిలిచిన ఆయన.. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ బాధ్యతలను తన భుజాలకు ఎత్తుకున్నాడు. తెలంగాణలో అధికారంలో లేకపోవడంతో కొంచెం వెనుకబడిన టీడీపీని, కాపాడుకునేందుకు రేవంత్ తీవ్రంగా కృషి చేశాడు. ప్రభుత్వంపై, సీఎం, మంత్రులు, ఇతర అధికార పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. ప్రభుత్వంపై పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీనే బలమైన ప్లాట్‌ఫాం అని నమ్మిన రేవంత్.. ఏకంగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఇక, అప్పటి నుంచి రేవంత్ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నాడు. దీంతో కేసీఆర్ రేవంత్‌పై దృష్టి సారించారు.

 అభివ్రుద్ది ప‌నుల పేరుతో ఎంట్రీ.. అవ‌మానంతో వెన‌క్కి త‌గ్గిన మంత్రులు..

అభివ్రుద్ది ప‌నుల పేరుతో ఎంట్రీ.. అవ‌మానంతో వెన‌క్కి త‌గ్గిన మంత్రులు..

ప్ర‌భుత్వం నియంత్రుత్వ పోక‌డ‌లు అవ‌లంబిస్తున్న‌ప్పుడు ప్ర‌శ్నించే హ‌క్కు ప్ర‌తిప‌క్షాల‌కు ఉంటుంద‌ని కాంగ్రెస్ వాదిస్తోంది. చ‌ట్ట‌స‌భ‌ల్లో గొంతునొక్కే ప్ర‌య‌త్న‌మే కాకుండా ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌జ‌ల‌మ‌ద్య కు వెళ్ల‌నీయ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని కాంగ్రెస్ విశ్లేషిస్తోంది. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌తిప‌క్షాలు ఎక్క‌డ‌కైనా వెళ్లి ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవ్వ‌డం అత్యంత సాధార‌ణ‌మైన అంశ‌మ‌ని.., ప్ర‌భుత్వం ఇదే అంశాన్ని రాజ‌కీయం చేస్తూ ప్ర‌తిప‌క్షాల‌పైన క‌క్ష్య పూరితంగా వ్య‌వ‌హ‌రించాల‌నుకోవ‌డం అవివేక‌మ‌ని కాంగ్రెస్ అంటోంది. రేవంత్ రెడ్డి లాంటి నాయ‌కున్ని అణివేయాల‌నుకుంటే ప్ర‌జాక్షేత్రంలో అదికార పార్టీకి బంగ‌పాటు త‌ప్ప‌ద‌నే అభిప్ర‌యాలు కూడా వినిపిస్తున్నాయి.

 అబాసుపాలైన మంత్రులు.. కొడంగ‌ల్ ఘాటుగా స్పందించిన రేవంత్ అనుచ‌రులు..

అబాసుపాలైన మంత్రులు.. కొడంగ‌ల్ ఘాటుగా స్పందించిన రేవంత్ అనుచ‌రులు..

కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను వేరే జిల్లాలో కలిపేశారు. అయినా, కొడంగల్‌లో రేవంత్‌కు ఉన్న ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. దీంతో టీఆర్ఎస్ ఆ స్థానంపై మరింత దృష్టి సారించింది. ఇందుకోసం స్థానిక ప్రజలను టీఆర్‌ఎస్‌ వైపు ఆకర్షించడంతోపాటు పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శనివారం ఆరుగురు మంత్రులు కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించారు. అంతేకాదు, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడి ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. మరోవైపు, ఇక్కడ నిలబెట్టే అభ్యర్ధిని ఇప్పటికే దాదాపుగా ఖరారు చేసిన టీఆర్ఎస్.. ఇప్పటి నుంచి ఆయనతో పనులు ప్రారంభించి, తద్వారా నియోజకవర్గంలో పట్టుసాధిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆ పార్టీ భావిస్తోందని సమాచారం. ఒక నాయకుడిని ఓడించడానికి టీఆర్ఎస్ పడే తాపత్రయాన్ని చూసిన అక్కడి ఓట్లర్లు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఒక్క నాయ‌కుడిని ఎదుర్కొనేందుకు ఇంత మంది మంత్రులతో పాటు స‌గం ప్ర‌భుత్వ యంత్రాంగం కొడంగ‌ల్ లో మొహ‌రింప‌జేయ‌డం అదికారు పార్టీకి ఎంత వ‌ర‌కు సమంజ‌స‌మ‌ని స్థానికులు ప్ర‌శ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+