బాగా పని చేయని ఎమ్మెల్యేల్లో ఆందోళన వద్దు, సర్వేలన్నీ మనకే: కేసీఆర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో మన పార్టీనే గెలిపిస్తారని తెరాస అధ్యక్షులు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. సర్వేలన్నీ తెరాస అఖండ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పాయన్నారు.

అసెంబ్లీ వద్ద రేవంత్ రెడ్డికి చేదు, నేరస్థుడా అని కిషన్ రెడ్డి ఆగ్రహం

ఇటీవలి సర్వేతో పనితీరు కనబరచలేదని తేలిన ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. వారు తమ పనితీరును మెరుగుపరుచుకొని ప్రజలకు దగ్గర కావాలన్నారు.

శనివారం ప్రగతి భవన్లో ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెరుగైన పనితీరు చూపని వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కవనే ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ఏప్రిల్ 5వ తేదీలోగా సభ్యత్వాల నమోదు, ఏప్రిల్ 15వ తేదీలోగా మండల, జిల్లా పార్టీల కమియీలు వేయాలన్నారు.

TRS will win 2019 elections: KCR

మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. ప్రభుత్వంలో ఉన్న వారైనా, పార్టీలో ఉన్నవారైనా విధానాల అమలులో కీలకపాత్ర పోషించాలన్నారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతి కమిటీలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం ఉండాలని, ఈ బడ్జెట్‌లో కొత్తగా ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేశామన్నారు. దీని స్ఫూర్తిని అర్థం చేసుకొని ప్రజాప్రతినిధులు ఆయా వర్గాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేయాలన్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఖర్చు చేసేటప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం కార్యక్రమాలుండాలన్నారు.

బీసీ వర్గాలు, చేతి వృత్తులకు ఆర్థిక చేయూత అందించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ కార్యక్రమాలపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదలవుతాయన్నారు.

2019 ఎన్నికల్లో మళ్లీ అఖండ విజయం సాధిస్తామని చెప్పారు. ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో ఘనవిజయం సాధించటంతోపాటు 17 ఎంపీ సీట్లలో 15 సీట్లను గన్‌షాట్‌గా గెలుచుకుంటామన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Close on the heels of survey on performance of ministers and MLAs, Chief Minister K Chandrashekar Rao on Saturday came up with a progress report on the functioning of the MPs.
Please Wait while comments are loading...