ఎగ్జిట్ పోల్స్: టీఆర్ఎస్దే విజయం, రెండో ప్లేస్‌లో బీజేపీ
మునుగోడు బై పోల్ ముగిసింది. భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దాదాపు అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు నిలిచాయి. బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుందట. కానీ బీజేపీ మాత్రం తమకే విజయ అవకాశాలు అని అంటోంది. మెజార్టీ పోల్స్ మాత్రం గులాబీ దండుదే విజయం అని అంటోంది.
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో అధికార టీఆర్ఎస్ 40.9 శాతం ఓట్లతో విజయం సాధిస్తుందని తేలింది. బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 23 శాతం ఓట్లు, బీఎస్పీకి 3.2 శాతం ఓట్లు, ఇతరులకు 1.9 శాతం ఓట్లు వచ్చాయి. మిగతా సంస్థలు కూడా దాదాపు ఇలానే చెప్పాయి.

త్రిశూల్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఏకంగా 47 శాతం ఓట్లు రాగా బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 18 శాతం ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు రానున్నట్లు తేలింది.
ఇక పల్స్ టుడే విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీకి 42 నుంచి 43 వరకు, బీజేపీకి 38.5 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ 14 నుంచి 16 శాతం, బీఎస్పీ 3 శాతం, ఇతరులు 1 శాతం ఓట్లు పడతాయట. ఎస్ఏఎస్ గ్రూప్ టీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 35 శాతం వస్తాయని తెలిపింది.
నేషనల్ ఫ్యామిలీ టీఆర్ఎస్ 42.11 శాతం, బీజేపీ 35. 17 శాతం ఓట్లు రాబడతాయని తెలిపింది. ఇక నాగన్న టీఆర్ఎస్ పార్టీకి 48 నుంచి 51 శాతం ఓట్లు, బీజేపీ 31 నుంచి 35 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంటుందని తెలిపింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications