హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిఎస్ ఐపాస్‌తో 25వేల కోట్ల పెట్టుబడులు: 5జిల్లాల్లో 14పరిశ్రమలకు అనుమతి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టిఎస్ ఐపాస్ కింద 14 పరిశ్రమలకు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం అనుమతి పత్రాలు అందజేశారు. 7079 మందికి ఉపాధి కల్పించే 14 పరిశ్రమలు 1118.62 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించనున్నారు. మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పరిశ్రమలు స్థాపించనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు టిఎస్‌ఐపాస్ ద్వారా 1013 యూనిట్స్‌కు అనుమతి ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. 25972,28 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించడంతో మొత్తం 76,314 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.

ఎమ్మార్‌పై కార్యాచరణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఒక దఫా సమావేశం నిర్వహించిందని, తదుపరి సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తమకు సత్వరమే అనుమతులు ఇచ్చినందున పలు కంపెనీల ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు, మంత్రి జూపల్లికి కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణలో అన్ని రకాల చెల్లింపులు ఆన్‌లైన్‌లో ఉండేట్టు చేస్తామని, దీని వల్ల ఆలస్యాన్ని నివారిస్తామని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ తెలిపారు. రెండు వందల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టే పలు పరిశ్రమలకు సంబంధించి అనుమతి ప్రక్రియ సాగుతుందని తెలిపారు.

ఏప్రిల్‌లో పలు మెగా ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయని, చైనా, స్వీడన్ పర్యటన విజయవంతం అయిందని చెప్పారు. నిమ్జ్‌కు లాంచనప్రాయంగా అనుమతి లభించిందని తెలిపారు. టిఎస్‌ఐపాస్ ప్రపంచంలోనే అత్యున్నత పారిశ్రామిక విధానం అని తెలిపారు.

టిఎస్ ఐపాస్

టిఎస్ ఐపాస్

టిఎస్ ఐపాస్ కింద 14 పరిశ్రమలకు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం అనుమతి పత్రాలు అందజేశారు.

టిఎస్ ఐపాస్

టిఎస్ ఐపాస్

7079 మందికి ఉపాధి కల్పించే 14 పరిశ్రమలు 1118.62 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించనున్నారు. మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పరిశ్రమలు స్థాపించనున్నారు.

టిఎస్ ఐపాస్

టిఎస్ ఐపాస్

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు టిఎస్‌ఐపాస్ ద్వారా 1013 యూనిట్స్‌కు అనుమతి ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. 25972,28 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించడంతో మొత్తం 76,314 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.

టిఎస్ ఐపాస్

టిఎస్ ఐపాస్

అనుమతులు పొందిన పరిశ్రమల వారంతా 80శాతం మేరకు స్థానికులకే ఉపాధి కల్పించాలన్నారు.

టిఎస్ ఐపాస్

టిఎస్ ఐపాస్

నిపుణులు అందుబాటులో లేకపోతే మాత్రం ఇతరరాష్ట్రాల వారిని నియమించుకోవచ్చని చెప్పారు. పరిశ్రమల అవసరాలు ముందే చెబితే స్థానిక యువతకు నైపుణ్యశిక్షణ ఇచ్చి పరిశ్రమ ప్రారంభం నాటికి వారిని సిద్ధం చేస్తామన్నారు.

టిఎస్ ఐపాస్

టిఎస్ ఐపాస్

పరిశ్రమలకు అవసరమైన మానవవనరులు, ఇతర అంశాలపై త్వరలో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమలకు భూములు పొంది వాటిని చేపట్టని వారికి ఇప్పటికే నోటీసులిచ్చామని, కొన్ని కేటాయింపులు రద్దు చేశామని తెలిపారు.

టిఎస్ ఐపాస్

టిఎస్ ఐపాస్

ఎమ్మార్‌పై కార్యాచరణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఒక దఫా సమావేశం నిర్వహించిందని, తదుపరి సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

టిఎస్ ఐపాస్

టిఎస్ ఐపాస్

తమకు సత్వరమే అనుమతులు ఇచ్చినందున పలు కంపెనీల ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు, మంత్రి జూపల్లికి కృతజ్ఞతలు తెలిపారు.

టిఎస్ ఐపాస్

టిఎస్ ఐపాస్

తెలంగాణలో అన్ని రకాల చెల్లింపులు ఆన్‌లైన్‌లో ఉండేట్టు చేస్తామని, దీని వల్ల ఆలస్యాన్ని నివారిస్తామని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ తెలిపారు.

English summary
Telangana Minister for Industries Jupally Krishna Rao has stated that investments worth over Rs. 25,972 crore have been cleared during the last six months, after the State Government introduced Telangana State Industrial Project Approval and Self-Certification System (TS-iPASS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X