కేసీఆర్ జైలుకెళ్లడం పక్కా.. నీ గొయ్యి.. నువ్వే తవ్వుకుంటున్నావ్.. బండి సంజయ్ వార్నింగ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్‌ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఉద్యోగుల కోసమే తాను జైలుకు వెళ్లాలని స్పష్టం చేశారు. తెలంగాణంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటే.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందన్న సంగతి మరచిపోవద్దని కేసీఆర్‌ను హెచ్చరించారు. రాష్ట్రంలో ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైందన్నారు.
Recommended Video

జైలు నుంచి బండి సంజయ్ విడుదల
టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసినా సీఎం కేసీఆర్‌కు సిగ్గురావడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. దుర్మార్గపు పాలనను ఎవరు ప్రశ్నించినా జైలుకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈసందర్భంగా జైలువద్దకు బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసమే తాను జైలుక వెళ్లాలని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 317ను సవరించాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేసీఆర్ జెలుకు వెళ్లడం పక్కా..
కరోనా నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి, కార్యకర్తలపై పోలీసులు దాడులు చేశారని మండిపడ్డారు. లాఠీఛార్జీలకు , అరెస్ట్‌లకు భయపడేది లేదన్నారు. అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. మమ్మల్ని అరెస్ట్ చేసి కేసీఆర్ రాక్షానందం పొందుతున్నారని దుయ్యబట్టరు. కేసీఆర్‌ను వదిలి పెట్టేది లేదని హెచ్చిరించారు. తాను ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లా.. కానీ కేసీఆర్ మాత్రం వేరే ఇష్యూపై జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. అప్పుడు కేసీఆర్ దేవుడు కాపాడలేరని విమర్శించారు.

తెలంగాణలో ధర్మయుద్ధం మొదలైంది.
ఉపాధ్యాయులు, ఉద్యోగులు వారి హక్కుల కోసం పోరాడాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని వారికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమన్నారు. కేసీఆర్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధర్మయుద్ధం మొదలైందన్నారు. కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. జీవో 317ను సవరించకపోతే మరో సారి జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా అని ఇష్టాను సారంగా వ్యవహారిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications