తెలంగాణ ఎంసెట్-2 ఫలితాలు విడుదల: ర్యాంకర్లు వీరే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఎంసెట్-2 ఫలితాలను సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది 50,961 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 47,644 మంది విద్యార్థులు ఎంసెట్-2కు అర్హత సాధించారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 21 తర్వాత నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యార్ధులకు సూచించారు. 25 నుంచి 29 వరకు విద్యార్ధుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని అన్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి మెడికల్, బీడీఎస్ కౌన్సిలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు.

కాగా ఎంసెట్-2 పరీక్ష ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశ పరీక్షలో 90.76 శాతంగా హాజరు నమోదైంది. 56,153 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 50,961 మంది విద్యార్థులు ఎంసెట్-2కు హాజరయ్యారు.

TS EAMCET 2 results 2016 to be declared today at 5 pm

ఎంసెట్-2 ర్యాంకుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ర్యాంకులు సాధించింది వీరే:
తొలి ర్యాంక్ ఉజ్వల్ (హైదరాబాద్)
రెండో ర్యాంక్ ఐశ్వర్య (మెదక్)
మూడో ర్యాంక్ సాయి సుశృత (కర్నాలు)
నాలుగో ర్యాంక్ వేణు మాధవ్ (హైదరాబాద్)
ఐదో ర్యాంక్ అంకిత్ రెడ్డి (హైదరాబాద్)
ఆరో ర్యాంక్ ప్రణవి (మహాబూబాబాద్)
ఏడో ర్యాంక్ తేజస్విని (అనంతపురం)
ఎనిమదో ర్యాంక్ సిద్ధార్ధ్ (హైదరాబాద్)
తొమ్మిదో ర్యాంక్ వినీత్ (హైదరాబాద్)
పదో ర్యాంక్ కృష్ణగీత్ (ఖమ్మం)

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jawaharlal Nehru Technological University, Hyderabad will declare the results of Telangana Engineering, Agriculture and Medical Common Entrance Test -2 (TS EAMCET-2) today at 5 pm. The exam was held on July 9.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X