Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతు రుణమాఫీపై రేవంత్ టీం కసరత్తు - ఇలా అమలు చేద్దాం..!!

ముఖ్యమంత్రి రేవంత్ మరో కీలక హామీ అమలు పైన అడుగులు వేస్తోంది. అధికారంలోకి వస్తూ రూ 2 లక్షలు రుణ మాఫీ చేస్తామని నాడు హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు దిశగా అధికారుల నుంచి ప్రభుత్వం పూర్తి లెక్కలు తీస్తోంది.రైతుల అప్పులను అసలు, వడ్డీ లెక్కగట్టి రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రాష్ట్ర అర్దిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని అమలు మార్గాలపైన కసరత్తు మొదలు పెట్టారు. కటాఫ్ తేదీ పైన ఆలోచన చేస్తున్నారు.

రుణ మాఫీపై అడుగులు: అన్వేషిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో భాగంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రైతుల అప్పులను అసలు, వడ్డీ లెక్కగట్టి రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 39 లక్షల మంది రైతులు.. బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణ గ్రహీతలుగా ఉన్నారు.

TS government begin Exercise on implementation of loan waiver, officials submits reports

పంట పెట్టుబడి కోసం ఈ రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి సుమారు రూ.40 వేల కోట్లు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడేనాటికి ఈ మేరకు బకాయిలు ఉన్నాయి. ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. అసలు, వడ్డీ లెక్కగట్టి రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.40 వేల కోట్ల వరకు బ్యాంకుల్లో అప్పులు ఉన్నట్లు అధికారులు తేల్చారు.

లెక్కలు - కసరత్తు: రుణ మాఫీ అమలుకు మార్గదర్శకాలను స్క్రీనింగ్ చేస్తే దాదాపు 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రూ.2 లక్షల లోపు అప్పు ఉంటే.. మొత్తం మాఫీ అవుతుంది. అంతకంటే ఎంత ఎక్కువ ఉన్నా రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తారు. దీని ద్వారా రూ 32 వేల కోట్ల వరకు మాఫీ చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నిధులను ఎలా సమీకరించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

బ్యాంకర్లతో మాట్లాడి.. ప్రభుత్వమే రుణం తీసుకోవాలనే మార్గంపై చర్చ జరుగుతోంది. దీని ద్వారా ముందుగా రైతుల పేరుమీద ఉన్న అప్పుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదికి బదలాయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాంగ్‌ టర్మ్‌ పెట్టుకొని.. వాయిదాల పద్ధతిలో ప్రభుత్వమే బ్యాంకులకు అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పలా మారిన నేపథ్యంలో కొత్త రుణాలకు అవకాశం లేదు.

నిధుల సమీకరణ: దీంతో, ప్రభుత్వం రైతుల అప్పులు అప్పులు బదలాయించుకొని వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు చెల్లించడమే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు బ్యాంకులు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఏకకాలంలో రుణమాఫీ అమలుకు సిద్ధమైతే బడ్టెట్‌లో భారీ కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. 2023-24 బడ్జెట్‌లో ఇప్పటికే కేటాయించిన నిధులను కూడా వినియోగించుకోవచ్చు. రైతులు తీసుకున్న అప్పులపై అధికారులు లెక్కలు తీస్తుండడంతో.. ఎప్పటివరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారన్న చర్చ మొదలైంది.

రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన తేదీని కటాఫ్‌ తేదీగా నిర్ణయిస్తారా..లేక కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తేదీ డిసెంబర్, 7ని కటాప్ గా తీసుకోవాలా అనేది నిర్ణయించాల్సి ఉంది. దీంతో..పూర్తి సమాచారం సేకరించిన ప్రభుత్వం..త్వరలోనే బ్యాంకర్లతో చర్చించే అవకాశం ఉంది. ఆ తరువాత రుణ మాఫీ అమలు పైన ప్రకటన చేసేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+