'తెలంగాణ' నన్ను వేధిస్తోంది, ఏపీ పట్టించుకోవట్లేదు: మత్తయ్య
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తోందని జెరూసలేం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇతను సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో నిందితుడు. ఆయన సోమవారం నాడు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తోందని జెరూసలేం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇతను సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో నిందితుడు. ఆయన సోమవారం నాడు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
ఈ కేసులో రక్షించాల్సిన ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెండు ప్రభుత్వాలు రాజీకి వచ్చినా తనను బలిపశువు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పిటిషన్ వేయడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు.

ఈ కేసులో స్టీఫెన్ సన్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. మత్తయ్యను రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications