అంబర్‌పేటలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం: విచారణకు ఆదేశం, ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

హైదరాబాద్: అంబర్‌పేట పరిధిలోని రామాంతపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి టీసీ గురించి మాట్లాడుదామని ప్రిన్సిపాల్ గదికి వెళ్లిన ఓ విద్యార్థి నాయకుడు తనతోపాటు తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకున్నాడు. పక్కనే దీపం ఉండటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి, ఏవో అశోక్ రెడ్డికి గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఫీజు చెల్లించలేదనే కారణంతోనే బాధిత విద్యార్థికి టీసీని కాలేజీ యాజమాన్యం ఇవ్వలేదని సమాచారం.

కాగా, ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డు కార్యదర్శికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

 TS government ordered an inquiry into the student suicide attempt incident in a college, Hyderabad

మరోవైపు, ఈ ఘటన నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపవద్దని కాలేజీలకు ఆదేశాలు జారీ చేశారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ దేనని స్పష్టం చేశారు. కారణమేదైనా విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడానికి వీల్లేదని తేల్చిచెప్పారు.

సర్టిఫికెట్లు ఇవ్వకపోతే డీఐఈవో, ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అంతేగాక, ప్రైవేటు కాలేజీలు తనిఖీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+