తెలంగాణ సచివాలయంలో ఏ మంత్రి ఎక్కడ - కేటాయింపు ఇలా..!!
తెలంగాణ సచివాలయం అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ అస్తిత్వ వైభవానికి ప్రతీకగా నిలిచిన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి సచివాలయ నూతన భవనం ప్రారంభించిన తరువాత అధికారికంగా అక్కడ నుంచి పాలన ప్రారంభించారు. నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ఫైల్ పైన సంతకం చేసారు. మొత్తం ఆరు ఫైళ్ల పైన కేసీఆర్ సంతకాలు చేసారు. మంత్రులు ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు.
నూతన సచివాలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 34 డోంబ్స్ తో ఎనిమిది ఎకరాల సువిశాల లాన్స్ మధ్య ఆరు అంతస్తుల సచివాలయం నిర్మాణం చేసారు. ప్రీ శాఖ సెంట్రల్ ఏయిర్ కండీషన్ తో పాటుగా ఇంటరీయర్ డిజైన్స్ తో తీర్చి దిద్దారు. అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేసారు. కాకతీయ శైలి, హిందూ, దక్కనీ శైలుల మేళవింపుతో రూపుద్దిద్దుకున్న నూతన సచివాలయంలో మంత్రులు, శాఖలకు ఫ్లోర్ల వారీగా కేటాయిస్తూ జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రౌండ్ ఫ్లోర్ లో కొప్పుల ఈశ్వర్ (A వింగ్), మల్లారెడ్డి (B వింగ్) లో ఛాంబర్లు కేటాయించారు. ప్రతీ వింగ్ కు సంబంధించి ప్రత్యేక ప్రవేశ మార్గాలను ఖరారు చేసారు.

సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ లో.. మంత్రులు మహమూద్ అలీ (A వింగ్), సబితా ఇంద్రారెడ్డి (B వింగ్), ఎర్రబెల్లి (D వింగ్)కు కేటాయించారు. సెకండ్ ఫ్లోర్ లో హరీష్‌రావు (A వింగ్), జగదీష్ రెడ్డి (B వింగ్), తలసాని శ్రీనివాస్ (D వింగ్) కి ఖరారు చేసారు. థర్డ్ ఫ్లోర్ లో కేటీఆర్ (A వింగ్), సత్యవతి రాథోడ్ (B వింగ్), నిరంజన్ రెడ్డి (D వింగ్) లో కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫోర్త్ ఫ్లోర్ లో ఇంద్రకరణ్ రెడ్డి (A వింగ్), శ్రీనివాస్ గౌడ్ (B వింగ్), గంగుల కమలాకర్ (D వింగ్)కు ఖరారు చేసారు. ఫిఫ్త్ ఫ్లోర్ లో ప్రశాంత్ రెడ్డి (A వింగ్), పువ్వాడ అజయ్ (D వింగ్) కి కేటాయించారు. ఇక సిక్స్త్ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది. సీఎంతో తో పాటుగా కేబినెట్ సమావేశ మందిరం ఏర్పాటు చేసారు. సీఎం పేషీ, సీఎం కార్యదర్శుల కోసం కేటాయించారు.
ప్రధాన శాఖల కార్యాలయాలను గ్రౌండ్ ఫ్లోర్ లో ఎస్సీ సంక్షేమ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, రెవెన్యూ, కార్మిక, ఉపాధి కల్పన శాఖలకు కేటాయించారు. మొదటి అంతస్తు లో హోం, గ్రామీణాభివృద్ది, విద్యా, పంచాయతీరాజ్ శాఖలకు ఖరారు చేసారు. రెండో అంతస్తులో వైద్యారోగ్యం, విద్యుత్, సెకండ్ ఫ్లోర్, పశు సంవర్ధక, ఆర్థిక శాఖలు ఉండనున్నాయి. మూడవ అంతస్తు లో మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, పురపాలక, పట్టణాభివృద్ది, ప్లానింగ్, ఐటీ, వ్యవసాయ, సహకార, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు ఉండనున్నాయి. నాల్గవ అంతస్తులో పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, యువజన, పర్యాటక, బీసీ సంక్షేమ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, నీటి పారుదల, న్యాయశాఖలకు కేటాయించారు. 5వ అంతస్తులో రవాణా, రహదారులు, సాధారణ పరిపాలన, భవనాల శాఖలు ఉండనున్నాయి.












Click it and Unblock the Notifications