ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈసారి అమ్మాయిలదే పై చెయ్యి; 62శాతం ఉత్తీర్ణత
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాలలో విద్యార్థులు ఫస్ట్ ఇయర్ లో 63.32శాతం సెకండ్ ఇయర్ లో 67.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ఫస్టియర్, సెకండ్ ఇయర్ తో కలిపి మొత్తం 9,28,262 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 5,90,327 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలలో అమ్మాయిలు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్ ఫలితాలలో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో, హనుమకొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

ఇంటర్ రిజల్ట్స్ తెలుసుకోండిలా
విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్ ని 3 ప్రభుత్వ వెబ్సైట్లలో చూసుకోవచ్చని ప్రకటించారు. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.in లో రిజల్ట్స్ చూసుకోవచ్చని తెలిపారు. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే, స్క్రీన్ పై ఫలితాలు కనిపిస్తాయని, మార్కులను కూడా ప్రింట్ తీసుకోవచ్చని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు . మే 23 వ తేదీన ఇంటర్ పరీక్షలు నిర్వహించగా ఫలితాలు కాస్త ఆలస్యంగా విడుదలయ్యాయి.

ఇంటర్ ఫలితాల పూర్తి వివరాలు వెల్లడించిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
ఇంటర్ మొదటి సంవత్సరం లో 4,64,892 మంది విద్యార్థులు హాజరుకాగా, ఇందులో 2, 94, 378 మంది పాసయ్యారు అని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 4,42,895 మంది పరీక్షలు రాయగా 2, 97,458 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఇక జనరల్ లో 4,14, 380 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 2,68,763 మంది ఉత్తీర్ణులైన ట్లుగా పేర్కొన్నారు. వీరి ఉత్తీర్ణత శాతం 64 శాతంగా ఉంది. ఇక ఒకేషనల్ లో 50,512 మంది పరీక్షలు రాయగా 25, 615 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరి ఉత్తీర్ణత శాతం 54. 25 శాతంగా ఉంది.

ఆగస్ట్ 1వ తేదీ నుండి అడ్వాన్స్ద్ సప్లమెంటరీ .. ఆగస్ట్ లాస్ట్ వీక్ లో రిజల్ట్స్
ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, ఆగస్టు చివరి వారానికి ఫలితాలను వెల్లడిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా మహమ్మారి నేపద్యంలో విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్లైన్లో విద్యాబోధన చేశామని, ఈ ఏడాది 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థుల ఒత్తిడి తగ్గించడానికి కౌన్సెలింగ్ కూడా నిర్వహించామని మంత్రి పేర్కొన్నారు. పరీక్షల తేదీలు రెండు, మూడు సార్లు మారడంవల్ల విద్యార్థులు కొంతమేర ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications