టీచర్స్ లేకుండా ఇంగ్లీష్ మీడియం ఎలా?.. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్
తెలంగాణ ప్రభుత్వ స్కూల్స్‌లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. అయితే దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు లేకుండా ఇంగ్లీష్ మాద్యమాన్ని ఎలా బోధిస్తారని నిలదీశారు. ప్రజలను తప్ప దోవపట్టించేందుకే కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. కేజీ టు పీజీ అమలు చేయాలంటే ముందు టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్న విషయం సీఎం కేసీఆర్ తెలియాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

విద్యాహక్కు చట్టం అమలు చేయాలి..
రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని కోరితే టీఆర్ఎస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీనిని అమలు చేస్తే పేద విద్యార్థులకు ప్రైవేటు కళాశాలల్లో 25 శాతం ఉచితంగా ఆగ్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనిని అమలు చేయకుండా కేజీ టూ పీజీ ఇస్తున్నామంటూ కేసీఆర్ దాటవేస్తున్నారని మండిపడ్డారు. విద్యాహక్కు చట్టం అమలులోకి వస్తే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని రేవంత్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు లేక అనేక పాఠశాలలను మూసివేశారని విమర్శలు గుప్పించారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయడంలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

పబ్‌లు, పార్టీలతో కరోనా రాదా..?
విద్యావ్యవస్థను సీఎం కేసీఆర్ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. స్కూల్స్‌లో కరోనా వచ్చినా మరణాల సంఖ్య ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు. అయినా పాఠశాలలను మూసివేశారు. కానీ బయట పబ్‌లు, పార్టీలను అనుమతి ఇచ్చారు. వాటి వల్లే ఎక్కు కరోనా కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్కలేదని దుయ్యబట్టారు. అందుకే కరోనాపై ప్రధాని జరిపిన సమీక్షకు ఆయన హాజరు కాలేదని ఆరోపించారు. యూనివర్శిటీలను నిర్వీర్యం చేశారు. ఉద్యోగాలు చేపట్టకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.

ఎంఐఎంకు కేసీఆర్ మిత్రద్రోహం?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి టీఆర్ఎస్ ప్రచారం చేస్తే ఎంఐఎంకి సీఎం కేసీఆర్ మిత్ర ద్రోహం చేసినట్లేనని రేవంత్ విమర్శలు గుప్పించారు. యూపీలో ఎంఐఎం పార్టీ దాదాపు 100 సీట్లకు పైగా పోటీ చేస్తోంది. తెలంగాణలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకొంది. మరి యూపీలో అసదుద్ధీన్ ఓవైసీకి కాకుండా సమాజ్ వాదీ పార్టీకి మద్దతు తెలిపితే ఎంఐఎంకు అన్యాయం చేసినట్లే అవుతుందని పేర్కొన్నారు.

చిన్నజీయర్ స్వామీజీ పక్కన రియల్ ఎస్టేట్ బ్రోకర్,.
చిన్న జీయర్ స్వామిజీ రియల్ఎస్టేట్ బ్రోకర్ ను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని, దీనిపై తమకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో చిన్న జీయర్ స్వామిజీ ఆశ్రమంలో రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. సమానత్వం అని టైటిల్ పెట్టి .. ఒక శ ఎంపీగా, పార్టీ అధ్యక్షుడిగా తనకు రియల్ ఉద్యోగితో ఆహ్వానం పంపుతారా అని మండిపడ్డారు. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చెట్లను నరికి రోడ్లు వేస్తున్నారని హైహోం రామేశ్వరరావు నుద్దేశించి విరచుకుపడ్డారు. దేవుని ముందు అందరూ సమానమే కాని స్వామీజి ముందుకు మాత్రం సమానత్వం కన్పించడంలేదని విమర్శలు గుప్పించారు.