కర్ణాటక ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ను నమ్మొద్దు: తెలంగాణ ప్రజలకు యడ్యూరప్ప

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేసింది. బీజేపీ జాతీయ నాయకులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పార్టీ నేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారు. తాజాగా, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తెలంగాణలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నమ్మి మోసపోవద్దని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. ఇలాంటి హామీలతోనే కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని యడియూరప్ప వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయన హైదరాబాద్‌​లో మీడియా సమావేశం నిర్వహించారు.

TS polls: Karnataka Ex CM Yediyurappa Campaign in Telangana; slams congress and brs

ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారెంటీలు అమలు కావడంలేదన్నారు. కర్ణాటక ప్రజలను మోసం చేసిన సిద్ధరామయ్య సర్కారు దివాలా దిశగా నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలనీ అబద్దపు హామీలతో కర్ణాటక ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.

ప్రస్తుతం తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీ పథకాల పేరిట ఆ పార్టీ సరికొత్త నాటకానికి తెరలేపిందని యడ్యూరప్ప విమర్శించారు. వాటిని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కోరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, మహిళా నేత ఖుష్బూ, తదితర నేతలు ప్రచారం నిర్వహించారు. మరోసారి బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. మరోవైపు, పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇరు పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+