తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్: వారికి మరో అవకాశం

తెలంగాణలో కొందరు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇది శుభవార్తే. ఒక్క సెంటిమీటర్ ఎత్తుతో డిస్‌క్వాలిఫై అయిన అభ్యర్థులకు తిరిగి ఫిజికల్ టెస్ట్ నిర్వహించాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: తెలంగాణలో కొందరు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇది శుభవార్తే. ఒక్క సెంటిమీటర్ ఎత్తుతో డిస్‌క్వాలిఫై అయిన అభ్యర్థులకు తిరిగి ఫిజికల్ టెస్ట్ నిర్వహించాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క్రియ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఫిజిక‌ల్ ఈవెంట్స్ ముగిశాయి. కేవ‌లం మెయిన్స్ ప‌రీక్ష‌లు మాత్ర‌మే మిగిలాయి.

ఈ క్రమంలో ఫిజిక‌ల్ ఈవెంట్స్‌లో ఎత్తు విష‌యంలో క్వాలిఫై కాలేకపోయిన చాలా మంది అభ్య‌ర్థులు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో 1 సెంటిమీట‌ర్, అంత కంటే త‌క్కువ ఎత్తులో డిస్‌క్వాలిఫై అయిన అభ్య‌ర్థుల‌కు మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించాల‌ని కోర్టు ఆదేశించింది.

TSLPRB decided to conduct physical tests again for those who disqualified with a height of one centimeter

కోర్టు ఆదేశాల మేర‌కు తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) తాజా నిర్ణ‌యం తీసుకుంది. ఒక సెంటిమీట‌ర్, అంత కంటే త‌క్కువ ఎత్తులో డిస్‌క్వాలిఫై అయిన అభ్య‌ర్థుల‌కు మ‌రోసారి ఫిజిక‌ల్ ఈవెంట్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

అంబ‌ర్‌పేట పోలీసు గ్రౌండ్స్‌, కొండాపూర్ 8వ బెటాలియ‌న్‌లో ఈవెంట్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఎత్తు విష‌యంలో డిస్‌క్వాలిఫై అయిన అభ్య‌ర్థులు మ‌రోసారి ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవాలి. ఫిబ్ర‌వ‌రి 10 ఉద‌యం 8 గంట‌ల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంట‌ల వ‌రకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం క‌ల్పించారు. ఈ ద‌ర‌ఖాస్తుతో పాటు అడ్మిట్‌కార్డును చూపించి, ఫిజిక‌ల్ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.

కాగా, 16,969 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం ప్రస్తుతం తుది రాతపరీక్షకు 1,75,657 మంది అర్హత సాధించారు. అంటే ఒక్కో పోస్టుకు 11 మంది వరకు పోటీలో ఉన్నారు. అలాగే 587 ఎస్‌ఐ పోస్టుల కోసం 59,574 మంది బరిలో మిగిలారు. అంటే ఒక్కో కొలువుకు 101 మంది వరకు పోటీలో ఉన్నారు. అయితే, తాజాగా తీసుకున్న నిర్ణయంతో పోటీ కొంత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+