విజయవాడ, బెంగళూరు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు రూట్లలో టికెట్‌పై 10 శాతం రాయితీ ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆగస్టు 15 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుందని తెలిపింది.
ఆ రెండు(విజయవాడ, బెంగళూరు) మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై ఈ 10 శాతం డిస్కౌంట్‌ను టీఎస్ఆర్టీసీ ఇవ్వనుంది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్నీ సర్వీసుల్లో జున్ 2 నుంచి 10 శాతం రాయితీ అమల్లోకి వస్తుంది. ఈ రాయితీ ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. రానూపోను ఒకే సారి బుక్ చేసుకుంటే మాత్రమే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ స్పష్టం చేసింది.

ఈ డిస్కౌంట్ వల్ల విజయవాడ మార్గంలో రూ.50 వరకు, బెంగళూరు మార్గంలో రూ.100 వరకు ఒక్కో ప్రయాణికుడికి ఆదా అవుతుందని తెలిపింది. ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ముందస్తు రిజర్వేషన్ కోసం తమ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.comలో చేసుకోవాలని సూచించారు. 60 రోజులు ఉంటుండగా ముందస్తు బస్సు రిజర్వేషన్ చేసేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. ఛార్జీలో రాయితీ ఇవ్వడం వల్ల ప్రయాణికులకి ఆర్థిక భారం తగ్గుతోందని పేర్కొన్నారు.
అరుణాచలగిరి ప్రదక్షిణకు ప్రత్యేక టీఎస్ఆర్టీసీ బస్సులు
అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల కోసం తొలిసారిగా ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీకి అనూహ్య స్పందన వస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటివరకు 30 ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేశారని.. ఆ సీట్లలన్ని భర్తీ అయ్యాయని వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులన్నీ జులై 1, 2 తేదీల్లో హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అరుణాచలానికి బయలుదేరుతాయని తెలిపారు.
జులై 3న గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి టీఎస్ఆర్టీసీ రెండు రోజుల టూర్ ప్యాకేజీని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనం.. అనంతరం అరుణాచలానికి ఈ బస్సులు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో గొల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుందని అన్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా మొదట ఒక ప్రత్యేక బస్సునే ఏర్పాటు చేయగా.. అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో సర్వీసులను సంస్థ పెంచిందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications