హైదరాబాద్-విజయవాడ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్: ఈ-గరుడ బస్సు ఛార్జీలు తగ్గింపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(TSRTC) శుభవార్త అందించింది. టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సుల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రారంభ ఆఫర్ కింద ఈ-గరుడ బస్సుల ఛార్జీలను తగ్గించినట్లు తెలిపారు. అయితే, ఈ ఆఫఱ్ నెల రోజుల వరకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
మియాపూర్ - విజయవాడ ఛార్జీ రూ. 830 ఉండగా.. దీన్ని రూ. 760కి తగ్గించారు. ఎంజీబీఎస్ - విజయవాడ ఛార్జీ రూ. 780 ఉండగా.. దీన్ని రూ. 720కి తగ్గించినట్లు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ మియాపూర్‌లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ ఏడాదిలోగా హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నారు. 20 నిమిషాలకో ఈ-గరుడ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్ నగరం నుంచి నిత్యం 50 వేల మంది విజయవాడ, రాజమండ్రికి ప్రయాణిస్తున్నారని, అందుకే తొలుత ఈ-గరుడ బస్సులను విజయవాడకు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
బస్సులు బయలుదేరు సమయాలివే:
మియాపూర్ నుంచి: 6.25, 8.25, 10.25, 18.05, 19.45, 21.45 గంటలకు ఈ-గరుడ బస్సులు బయలుదేరుతాయి.
ఎంజీబీఎస్ నుంచి: 8.10, 10.10, 12.10, 19.50, 21.30, 23.30 గంటలకు ఈ-గరుడ బస్సులు బయలుదేరుతాయి.
విజయవాడ నుంచి: 6.20, 8.00, 10.00, 18.40, 20.40, 22.40 గంటలకు ఈ-గరుడ బస్సులు బయలుదేరుతాయి.
ఇది ఇలావుండగా, వచ్చే రెండేళ్లలో 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం వెల్లడించారు. ఈ-బస్సులను మంగళవారం ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రైవేటు బస్ సర్వీస్‌లకు దీటు గా అత్యాధునిక సౌకర్యాలతో ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. పర్యావరణ అనుకూల ప్రజారవాణా కోసం ఆర్టీసీ ఈ-గరుడ బస్సులను అందుబాటులోకి తేవడం అభినందనీయమని కొనియాడారు. ఈ ఏడాదిలోగా హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications