మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఏసీ బస్సులతో సహా అన్ని బస్సులలో రేపు ఉచితప్రయాణం
తెలంగాణ రాష్ట్రంలోని మహిళామణులకు టిఎస్ఆర్టిసి అదిరిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చింది. మే 27వ తేదీన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే మహిళామణులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ మేరకు టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్ ఐదేళ్లలోపు చిన్నారులతో కలిసి తల్లులు అన్ని బస్సుల్లో ఆదివారం నాడు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించారు.
ఆర్టీసీ ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ పై మాతృమూర్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టిఎస్ ఆర్టిసికి ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి సజ్జనార్ టిఎస్ ఆర్టిసిని ముందుకు నడిపించడంలో వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ దూకుడు చూపిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులో సురక్షిత ప్రయాణానికి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, బస్టాండ్ లను శుభ్రంగా ఉంచడం, బస్టాండ్ లో ఉన్న టాయిలెట్స్ ను నీట్ గా మెయింటెన్ చేయడం పైన కూడా దృష్టిసారించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నారు.

మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించే దిశగా కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మహిళా లోకం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికే చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే సందర్భంగా అనేక బంపర్ ఆఫర్ లను ప్రకటించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇక తాజాగా మాతృమూర్తుల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.అమ్మ అనురాగాన్ని, ప్రేమను వెలకట్టలేమని, ఆ త్యాగమూర్తుల విశిష్ట సేవలను గుర్తుచేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణా ఆర్టీసీ ఎండి సజ్జనార్ పేర్కొన్నారు.
మదర్స్ డే సందర్భంగా ఆర్డినరీ బస్సుల నుండి ఏసీ బస్సుల వరకు అన్ని బస్సులలో మహిళామణులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సజ్జనార్ తెలిపారు. మాతృ దినోత్సవం రోజున తెలంగాణ ఆర్టీసీ అందిస్తున్న ఈ సదవకాశాన్ని మహిళలు, మాతృమూర్తులు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications