హైదరాబాద్-అరుణాచలం గిరి ప్రదక్షిణకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ: టికెట్ ధర, తేదీ వివరాలు
హైదరాబాద్: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం (Arunachalam) గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) శుభవార్త చెప్పింది. గురుపౌర్ణమి సందర్బంగా అరుణాచలం గిరిప్రదక్షిణకు భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసింది.
జులై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలను టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

ప్యాకేజీ వివరాలు:
అరుణాచల గిరి ప్రదక్షిణ టీఎస్ఆర్టీసీ ఓ టూర్ ప్యాకేజీలా అందిస్తోంది. సర్వీస్ నెంబర్ 98889 బస్సు జులై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి బయల్దేరుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకంలో విఘ్నేశ్వరుని దర్శనాంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది.
గిరి ప్రదక్షిణ పూర్తయ్యాక జులై 3న మధ్యాహ్నం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌కు చేరుకుంటుంది. అక్కడ దర్శనానంతరం మరుసటి రోజు జులై 4న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ తిరిగి చేరుకుంటుంది.
ఈ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి రూ. 2600గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీ సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://www.tsrtconline.in/oprs-web/guest/home.do?h=1 లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు.
ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ తోపాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చు.
ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి ప్రయాణికుల బస, ఇతర పూర్తి వివరాల కోసం 9959226257, 9959224911 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications