వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TSRTC STRIKE:ఆగిన మరో గుండె, మరో డ్రైవర్ మృతి, జీతాలు లేక.. 17కి చేరిన...

|
Google Oneindia TeluguNews

డిమాండ్లను తీర్చేందుకు ప్రభుత్వం ముందుకురాకపోవడం, జీతాలు చెల్లించకపోవడంతో ఆర్టీసీ కార్మికుల మనోవేదనకు గురవుతున్నారు. ఇటు మంత్రులు, సీఎం వ్యాఖ్యలతో మదనపడిపోతున్నారు. ఈ నెల 5న ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె 27వ రోజుకు చేరగా.. 17 మంది కార్మికులు చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

 ఆగిన గుండె

ఆగిన గుండె

ప్రగతి రథ చక్రాల చోదకుల గుండె ఆగిపోతుంది. కొందరు కండక్టర్లు కూడా మృత్యువాత పడుతున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో 27వ రోజులుగా సమ్మె చేస్తున్న.. ప్రభుత్వంలో చలనం రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వేతనాలు లేక ఇంటిల్లిపాదిలి ఇబ్బందిపడాల్సి వస్తోంది. నిన్న కరీంనగర్‌‌కు నంగునూరి బాబు అనే డ్రైవర్ చనిపోయిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇవాళ పాలమూరులో మరో డ్రైవర్ కృష్ణయ్యగౌడ్ చనిపోయారు.

గుండెపోటుతో..

గుండెపోటుతో..

మహబూబ్‌నగర్ డిపోకి చెందిన కృష్ణయ్య గౌడ్ గురువారం గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. వేతనం లేక అతని కుటుంబం ఇబ్బంది పడిందని ఆర్టీసీ నేతలు చెప్తున్నారు. కృష్ణయ్యది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని చెప్తున్నారు. కృష్ణయ్య 20 ఏళ్ల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం బండమీదిపల్లి అని కార్మిక నేతలు తెలిపారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

17కి చేరిన మృతుల సంఖ్య

17కి చేరిన మృతుల సంఖ్య

కృష్ణయ్యతో ఆర్టీసీ కార్మికుల మృతి 17కి చేరుకుంది. సకల జనుల సమరభేరీ సభకొచ్చిన కరీంనగర్‌కి చెందిన నంగునూరి బాబు అనే డ్రైవర్ గురువారం చనిపోయారు. బాబు మృతితో కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శుక్రవారం కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చారు. మృతుని కుటుంబసభ్యులను స్థానిక ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. బాబు చనిపోయి 24 గంటలు గడవకముందే మరో కార్మికుడు చనిపోవడం ఆందోళన కలగిస్తోంది.

27వ రోజుకి చేరిన సమ్మె

27వ రోజుకి చేరిన సమ్మె


డిమాండ్లపై జేఏసీ-ప్రభుత్వం పట్టువీడకపోవడంతో సమ్మె కొనసాగుతోంది. శుక్రవారంతో 27వ రోజుకు చేరుకుంది. సకల జనుల సమరభేరీ సభలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి జీతాల గురించి ప్రస్తావించారు. వేతనాలు లేకపోతే ఇబ్బంది అని.. కానీ ఆర్టీసీ విలీన అంశం తమ ఉనికికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. తమ లక్ష్యం దూరం ఉన్నందున కాస్త ఓపిక పట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికులు ఆత్మధైర్యం కోల్పోవద్దని నేతలు పదేపదే చెప్తున్నారు. కానీ డ్రైవర్, కండక్టర్ల మృతి మాత్రం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది.

English summary
another driver no more.. krishnaiah dead due to heart stroke.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X