TSRTC STRIKE:కార్మికుల పొట్ట కొట్టమని మోటారు సవరణ చట్టం చెప్పలే.. కేసీఆర్ కామెంట్లపై కిషన్ ఫైర్
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కొత్త మోటారు వాహన సవరణ చట్టం 2019 కార్మికుల పొట్ట కొట్టమని చెప్పలేదన్నారు. ఆయా రూట్లలో ప్రైవేట్ వాహనాలకు కూడా అనుమతి ఇవ్వాలనే చెప్పిందని విషయాన్ని నొక్కి వక్కాణించారు. కానీ కేసీఆర్ మాత్రం కేంద్రం చెప్పింది కదా అని విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
బీజేపీ ప్రభుత్వం రాకముందు కూడా దేశంలో ప్రైవేట్ బస్సులకు పర్మిట్ ఉందనే విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఆర్టీసీలో పోటీ తత్వం పెంచేందుకు రూట్ పర్మిట్లు ఇచ్చామని పేర్కొన్నారు. దీని ఉద్దేశం ఆర్టీసీని మూసివేయాలని చెప్పడం కాదన్నారు. మోటారు వాహన సవరణ చట్టంపై కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. సమస్యకు పరిష్కారం ప్రేమపూర్వక చర్చలేనని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.

కార్మికుల సమస్యలపై కూర్చొని మాట్లాడాలే తప్ప బెదిరించడం సరికాదన్నారు. ఆర్టీసీని మూసివేస్తామని బెదిరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వారంతా తెలంగాణ బిడ్డలు అని గుర్తుచేశారు. దాదాపు 50 వేల మంది మధ్యతరగతి కుటుంబాల పొట్ట కొట్టడం మంచి చర్య కాదన్నారు.
వారిపై లక్షలాది మంది ఆధారపడి ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. కార్మికులకు నాలుగుసార్లు డెడ్‌లైన్ విధిండచం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications