వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్-పువ్వాడ భేటీ.. హైకోర్టు ఆదేశాలు, బంద్‌పై డిస్కషన్

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మిక సంఘాలు శనివారం బంద్‌కు పిలుపునివ్వడం, మరోవైపు హైకోర్టులో సమ్మెపై విచారణ జరగడంతో ఏం భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వ దృష్టిసారించింది. దీంతో సీఎం కేసీఆర్‌తో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమావేశమయ్యారు. హైకోర్టు ఆదేశాలపై చర్చిస్తోన్నారు. మూడురోజుల్లో చర్చలు జరిపి కోర్టు తెలుపని సూచించడంతో ఏం చేయాలనే అంశంపై డిస్కష్ చేస్తున్నారు.

మూడురోజుల్లో చర్చలు జరుపాలని.. గుర్తింపు పొందిన రెండు సంఘాలను చర్చలకు పిలువాలని హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. కేసు విచారణకు ఈ నెల 28వ తేదీకి వాయిదావేసింది. అయితే ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతోనే చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. చర్చలకు ఆహ్వానిస్తే డిస్కష్ చేసేందుకు ఓకే అని కార్మిక సంఘాలు చెప్తున్నాయి.

tsrtc strike: minister puvvada met kcr.. discuss rtc strike issue

మరోవైపు శనివారం ఆర్టీసీ కార్మిక సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు విచారణ తర్వాత కూడా సమ్మె కొనసాగుతుందని జేఏసీ నేత అశ్వత్ధామరెడ్డి స్పష్టంచేశారు. దీంతో బంద్ నేపథ్యంలో ఎలాంటి వ్యుహం అనుసరించాలని కేసీఆర్.. అజయ్‌తో చర్చిస్తోన్నారు. ఇప్పటికే బస్సులు నడుస్తోన్నందున మరిన్ని బస్సు ట్రిప్పులను తిప్పాలని చూస్తున్నారు. దీంతోపాటు బస్సుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని స్పష్టంచేశారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో బస్సులు నడపాలని భావిస్తున్నారు.

English summary
telangana transport minister puvvada ajay met cm kcr. they discussion about rtc strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X