TSRTC STRIKE:యూనియన్ నేతల మాయ నుంచి బయటపడండి, కార్మికులకు మంత్రి గంగుల పిలుపు
ఆర్టీసీ కార్మికులు యూనియన్ మాయా నుంచి బయటకు రావాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. యూనియన్ నేతల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకొవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు విధుల్లో చేరాలని కోరారు. ఆర్టీసీ సమ్మెలో ప్రతిపక్షాలు చేరి కార్మికులను రోడ్డున పడేశాయని ఆరోపించారు. వారి స్వార్థం రాజకీయాల కోసం కార్మికుల కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు.
ట్రేడ్ యూనియన్లు, టీఎంయూ, జేఏసీ నేతల మాటలను కార్మికులు విశ్వసించొద్దని మంత్రి గంగుల కోరారు. సమ్మె చేపట్టి నేటికి నెలరోజులు అవుతుందని గుర్తుచేశారు. ఆచరణ సాధ్యం కానీ డిమాండ్లతో సమ్మె ఫలప్రదం కాబోదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విధుల్లో చేరిన కార్మికులకు పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పారు. కార్మికులను బెదిరించిన నేతలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

కరీంనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతిని విపక్షాలు రాజకీయం చేయడం సరికాదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బాబు మృతిపై మొసలి కన్నీరు కార్చిన నేతలు.. ఆనయ కుటుంబానికి సాయం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మీ బాధ మాట్లలోనా.. చేతల్లో ఏదీ అని ప్రశ్నించారు. బాబు మృతిని రాజకీయం చేయడం వెనక కారణం ఉందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నందున బాబు మృతి పేరుతో పబ్బం గడుపుకోవచ్చని చూస్తున్నారని విమర్శించారు. కానీ ఇది మంచి పద్ధతి కాదన్నారు. మీరు చేసే రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications