వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

tsrtc strike: టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ -నేటితో డెడ్ లైన్ పూర్తి -జీతాలియ్యకుంటే రేపట్నుంచే..

|
Google Oneindia TeluguNews

కరోనా విలయం దెబ్బ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(టీఎస్ఆర్టీసీ)లో మరో ప్రతిష్ట్రంభన నెలకొంది. టీఎస్ఆర్టీసీలో మరోమారు సమ్మె సైరన్ మోగనుంది. నేటి వరకూ జీతాలు చెల్లించకపోవడంతో బస్సులు బంద్ చేసేందుకు ఆర్టీసీ ఉద్యోగులు సిద్ధమయ్యారు.

రవాణా సంస్థలో సమ్మెకి సంబంధించి ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే యాజమాన్యానికి అల్టిమేటం ఇచ్చింది. ఆగస్టు 6 తేదీ లోపు ఈ నెల జీతాలు చెల్లించకుంటే సమ్మె బాట పడతామని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు తేల్చి చెప్పేశారు. గతంలోనే పలు డిమాండ్లకు సంబంధించి మెమోరాండం సమర్పించి నెల రోజులు కావొస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడంపై జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు జేఏసీ లేఖ రాసింది.

tsrtc-strike-telangana-rtc-employees-demand-salaries-by-august-6-threaten-to-go-on-strike

శుక్రవారంలోగా జీతాలు చెల్లించకుంటే 7 వ తేదీ నుంచి, అంటే శనివారం నుంచే సమ్మె చేయనున్నట్లు లేఖలో జేఏసీ నేతలు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారంపై కూడా యాజమాన్యం ఇంతవరకూ స్పందించపోవడం దారుణమని.. ఇప్పటి వరకూ కనీసం అధికారులను కూడా నియమించలేదని జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది.

Recommended Video

Hyderabad MMTS Trains Services Resumes From Today After 15 Months | SCR | Oneindia Telugu

వేతనాలు విడుదల చేయకపోతే సమ్మె చేస్తామని.. తమ కష్టాలు ఎమ్మెల్యేలందరికీ తెలిసేలా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జేఏసీ నిర్ణయించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

English summary
The Telangana State Road Transportation Corporation Joint Action Committee (RTC JAC) on Thursday, August 5, wrote to the Managing Director (MD) Sunil Sharma to disburse the salaries for the present month by friday (August 6), or witness a state-wide strike on August 7, as announced earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X