TSRTC: విజయవాడ వెళ్లేవారికి శుభవార్త.. 50 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్న టీఎస్ఆర్టీసీ..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) విజయవాడ-హైదరాబాద్ మార్గంలో 50 ఎసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. TSRTC మేనేజింగ్ డైరెక్టర్, VC సజ్జనార్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ ప్రకటనను విడుదల చేశారు.

41 సీట్ల సామర్థ్యంతో 12 మీటర్ల పొడవైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ బస్సులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 325 కిలోమీటర్లు వెళ్తాయని ఆయన చెప్పారు. సజ్జనార్ బస్సుల గురించి వివరాలను అందించారు.

TSRTC will run 50 AC electric buses from Hyderabad to Vijayawada

ఈ పర్యావరణ అనుకూల బస్సులకు 'ఈ-గరుడ' అని పేరు పెట్టామని తెలిపారు. ఇవి అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, అత్యాధునిక హంగులతో రూపొందించారని పేర్కొన్నార. వీటిలో సౌకర్యవంతమైన సీట్లు, ఎయిర్ కండిషనింగ్, మొదలైనవి ఉన్నాయన్నారు.

ఈ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు మియాపూర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద జరగనుందని ప్రకటించారు.తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి సంస్థ ఛైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఈ-గరుడ బస్సులను ప్రారంభించనున్నారు.

TSRTC ఇటీవల బస్ ట్రాకింగ్ యాప్‌ను ప్రారంభించింది, ఇది ఇప్పుడు Google Play స్టోర్‌లో అందుబాటులో ఉంది. బస్ స్టాప్‌లు, రాక సమయం, బస్సుల స్థానం గురించి నిజ-సమయ సమాచారాన్ని అందించడం దీని ఉద్దేశం.

కాగా ఆర్టీసీ తన ఆదాయం పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆర్టీసీ ఇప్పటికే కార్గో ద్వారా లాజిస్టిక్ సేవలు అందిస్తోంది. తాజాగా హైదరాబాద్ సిటీలి ప్రయాణికుల సంఖ్య పెంచుకునేందుకు కొత్త ఆలోచనలు చేస్తోంది.

ఇందులో భాగంగా టీ 24 టికెట్ ధరను రూ.90 లకు తగ్గించారు. అంతే కాదు ఈ టీ 24 టికెట్ ను సీనియర్ సిటిజన్లు, మహిళలకు రూ.80 లకే అందించున్నారు. ఈ టికెట్ తీసుకున్న వారు సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ఉచితంగా తీరుగొచ్చు. అలాగే ఎఫ్ 24 అనే టికెట్ కూడూ తీసుకుచ్చారు.

ఈ టికెట్ రూ.300 కొనుగోలు చేసి నలుగురు కుటుంబ సభ్యులు 24 గంటల పాటు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అలాగే టీ6 టికెట్ ను అందుబాటులోకి తెచ్చారు. రూ.50 చెల్లించి టీ6 టికెట్ కొనుగోలు చేస్తే ఆరు గంటల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటల నుంచి సాయింత్ర 4 గంటల వరకు ప్రయాణం చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+