రేవంత్‌ది మైండ్‌గేమ్: ''ప్రజా బ్యాలెట్ నిర్వహించండి, నవంబర్ 2న, జనరల్‌బాడీ''

Posted By:
Subscribe to Oneindia Telugu
  ఆత్మీయుల మాట..ముచ్చట.. : కెసిఆర్ ని బండ బూతులు తిట్టిన రేవంత్‌రెడ్డి | Oneindia Telugu

  హైదరాబాద్: రేవంత్‌రెడ్డి మైండ్‌గేమ్ ఆడుతున్నాడని టిడిపి జాతీయ అద్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ పరిణామాలపై పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

  ఢిల్లీకి రేవంత్‌: 2019లో పోటీ చేసే వారంతా అక్కడే, టిక్కెట్లకోసం రాహుల్‌ హమీ?

  తెలంగాణ రాష్ట్రంలో టిడిపిలో చోటుచేసుకొన్న పరిణామాలపై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో మంగళవారం నాడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు టిడిపి నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకొన్నారు.

  ఉత్తమ్ సమక్షంలో బాబుపై రేవంత్ పొగడ్తలు: కెసిఆర్‌పై దూకుడు

  ఈ తరుణంలో చంద్రబాబునాయుడు తెలంగాణ పార్టీ నేతలతో మంగళవారం నాడు టెలికాన్పరెన్స్ నిర్వహించి, పార్టీ బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

  టిఆర్ఎస్‌తో సంప్రదింపులు చేశాకే!: 'వారంతా కాంగ్రెస్‌లోకి'

   కొడంగల్‌లో పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలి

  కొడంగల్‌లో పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలి

  కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నేతలను ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేసేందుకు తీసుకొంటున్న చర్యలను పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు.ఉపఎన్నికకు సిద్దంగా ఉండాలని బాబు పార్టీ నేతలను ఆదేశించారు.

  రేవంత్ మైండ్‌ గేడ్ ఆడుతున్నాడు

  రేవంత్ మైండ్‌ గేడ్ ఆడుతున్నాడు

  రేవంత్‌రెడ్డి మైండ్‌గేమ్ ఆడుతున్నారని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు చెప్పారు. రేవంత్‌రెడ్డి మైండ్‌గేమ్‌తో నేతలు ఆందోళన చెందకూడదని చంద్రబాబునాయుడు సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ వైఖరి ఏమిటనే విషయాన్ని ప్రజలకు వివరించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.

   ప్రజా బ్యాలెట్ నిర్వహించాలి

  ప్రజా బ్యాలెట్ నిర్వహించాలి

  కొడంగల్ అసెంబ్లీ స్థానానికి వచ్చే ఏడాది మార్చి 29వ, తేది నాటికి ఉపఎన్నికలు నిర్వహించకపోతే ప్రజా బ్యాలెట్ నిర్వహించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. ఈ నియోజకవర్గంలో చోటుచేసుకొన్న పరిణామాలపై ప్రజల స్పందనను తెలుసుకోవాలని బాబు పార్టీ నేతలను ఆదేశించారు.అంతేకాదు పార్టీ పునర్నిర్మాణం కోసం శక్తివంచన లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబునాయుడు.

  నవంబర్ 2న, జనరల్‌బాడీ సమావేశం

  నవంబర్ 2న, జనరల్‌బాడీ సమావేశం

  రేవంత్‌ వెంట కొందరు టిడిపి నేతలు పార్టీని వీడారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ తరుణంలో పార్టీని బలోపేతం చేసేందుకు గాను నవంబర్ 2వ, తేదిన తెలంగాణ టిడిపి జనరల్‌బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా నేతలు, ముఖ్యమైన క్యాడర్‌ను ఆహ్వనించనున్నారు. అంతేకాదు పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి చంద్రబాబునాయుడు కూడ హజరుకానున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TDP will conduct Telangana state committe general body meeting on NOv 2 at Hyderabad. TDP chief Chandrababunaidu will attend this meeting. Chandrababu naidu teleconference with TTDP leaders on Tuesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి