టెక్కీ స్వాతి హత్య కేసులో ట్విస్ట్: పోలీసులపై లాయర్ నిందలు

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతిని హత్య కేసు మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె చేశాడని అనుమానిస్తున్న రామ్ కుమార్ తరఫు న్యాయవాది పోలీసులను నిందిస్తున్నారు. ఐటీ సంస్థ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో అరెస్టయిన మీనాక్షిపురం యువకుడు రామ్‌కుమార్‌ మంగళవారంనాడు చెన్నై సెషన్స్ కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశాడు.
రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామ్‌కుమార్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడడంతో పోలీసులు గట్టి బందోబస్తు మధ్య పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. అవసరమైతే రామ్‌కుమార్‌కు పుళల్‌జైలులోనే వైద్య సదుపాయాలు అందజేస్తామని వైద్యబృందం ప్రకటించింది. రామ్‌కుమార్‌ తరఫున న్యాయవాది కృష్ణమూర్తి మంగళవారం బెయిల్ పిటిషన్ వేశారు.

స్వాతిని హత్య చేసినట్టు చూసినట్లుగా చెబుతున్న ఒకరి సాక్ష్యం ప్రకారం రామ్‌కుమార్‌ను అరెస్టు చేశారని, ఆ సాక్షి కూడా గుర్తు తెలియని యువకుడు కత్తితో దాడి జరిపి హత్య చేశారని మాత్రమే చెప్పాడని కృష్ణమూర్తి వాదించారు. పైగా పోలీసులు అసలైన హంతకుడిని విడిచి అమాయకుడైన రామ్‌కుమర్‌ను అరెస్టు చేశారని, అతడిపై అబద్దపు నేరారోపణలతో అభియోగాలు నమోదు చేస్తున్నారని అంటూ ఈ స్థితిలో అతడికి బెయిలు మంజూరు చేయాలని పిటీషన్‌లో కోరారు.

Swathi

ఈ పిటిషన్ న్యాయమూర్తి జయచంద్రన్ ఎదుట త్వరలో విచారణకు రానున్నది. ఈ నేపథ్యంలో రామ్‌కుమార్‌ తరఫున న్యాయవాది కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. స్వాతి హత్య కేసులో రామ్‌కుమార్‌ ముద్దాయి కాదని, మారుమూల గ్రామంలో నివసిస్తున్న నిరుపేద యువకుడిని దురుద్దేశపూర్వకంగాహంతకుడిగా చిత్రీకరించారని అన్నారు.

స్వాతి హంతకుడిని రెండు రోజులలోగా పట్టుకోవాలని హైకోర్టు ఆదేశించడంవల్లే హడావిడిగా పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. రామ్‌కుమార్‌ బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకోలేదని, పోలీసులే అతడి గొంతుకోశారనే అనుమానాలున్నాయని ఆరోపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Infosys techie Swathi murder case is taking new turn, as suspect Ram Kumar's lawyer Krishna Murthy is making allegations against police of Chennai city in Tamil Nadu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి