వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీ9లో కొత్త ట్విస్టులు: ముగిసిన రవిప్రకాశ్ శకం? కొత్త సీఈవో నియామకం! ఎవరి వాదన ఏంటీ?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఉత్కంఠ రేపిన టీవీ 9 ఇష్యూ ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. అలంద మీడియా ఆరోపణలు, కేసు కంప్లైంట్‌తో వెనక్కి తగ్గిన రవిప్రకాశ్ కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చారు. టీవీ 9 సీఈవో పదవీనుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఇటు రవిప్రకాశ్ ఆరోపణలు ఏబీసీఎల్ తోసిపుచ్చింది. అవకతవకలకు పాల్పడినందునే తప్పించినట్టు స్పష్టంచేసింది.

దొడ్డిదారిన చొరబడి కంపెనీని లాక్కున్నారు

దొడ్డిదారిన చొరబడి కంపెనీని లాక్కున్నారు

రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో కొందరు పనిచేస్తున్నారని రవిప్రకాశ్ విమర్శించారు. మోసం, వంచన పేరుతో కొందరు టీవీ 9లో చొరబడ్డారని ఆరోపించారు. తప్పుడు ఫిర్యాదులు, కేసులతో వేధించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఎన్ఎల్సీటీ కరకటు ఆదేశాన్ని ధిక్కరిస్తూ సంస్థలో మార్పులు చేపట్టారని మండిపడ్డారు. ప్రొఫెషనల్ కంపెనీ సెక్రటరీని బెదిరించి ఏబీసీఎల్ డైరెక్టర్ల మీద తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. రిజిస్టార్ ఆఫ్ కంపెనీలో దొడ్డిదారిన నలుగురు డైరెక్టర్లన చొప్పించి పోలీసుల సహాయంతో టీవీ9ను ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు.

బెదిరించి, భయపెట్టారు

బెదిరించి, భయపెట్టారు

తప్పుడు కేసులతో వేధించే ప్రయత్నం చేశారని .. మీడియాలో అసత్యం ప్రచారం చేశారని రవిప్రశాక్ పేర్కొన్నారు. టీవీ 9 సిబ్బందిని వేధించి, దాడులకు గురిచేసి భయపెట్టారని .. బలవంతంగా కంపెనీకి చేతుల్లోకి తీసుకున్నారని రవిప్రకాశ్ వాపోయారు. అక్రమాలు, అన్యాయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా షేర్ హోల్డర్ మీతోనే ఉంటానని పేర్కొన్నారు. జర్నలిజాన్ని కాపాడటానికి, పాత్రికేయ విలువలను రక్షించడానికి మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నిలువరించడానికి ప్రయత్నిస్తానని స్పష్టంచేశారు.

అక్రమాలు వెలుగులోకి రావడంతోనే ...

అక్రమాలు వెలుగులోకి రావడంతోనే ...

రవిప్రకాశ్ మీడియా సమావేశం తర్వాత బోర్డు కూడా స్పందించింది. టీవీ 9లో రవిప్రకాశ్ కు 8, మరో ప్రతినిధి ఒకటిన్నర శాతం వాటా ఉందని తెలిపింది. తొమ్మిదిన్నర వాటాతో టీవీ 9 సంస్థలో అక్రమాలకు, ఫోర్జరీ చేశారని అలంద మీడియో పేర్కొంది. ఈ మేరకు ఆయనపై వేటు వేయాలని ఏబీసీఎల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది.

సీఈవోగా మహేంద్ర

సీఈవోగా మహేంద్ర

టీవీ 9 సీఈవోగా రవిప్రకాశ్ ను తప్పించిన తర్వాత ఏబీసీఎల్ డైరెక్టర్స్ బోర్డు కొత్త సీఈవో, సీవోవోను నియమించింది. సీఈవోగా మహేంద్ర మిశ్రాను బాధ్యతలు అప్పగించింది ఆయన ప్రస్తుతం టీవీ 9 కన్నడ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సీవోవోగా గొట్టిపాటి సింగారావును నియమించింది. ఈయన ప్రస్తుతం 10 టీవీ సీఈవోగా పనిచేస్తున్నారు.

English summary
TV 9 issue has finally come to an end. All the media allegations, the Ravi Prakash who came back with the case complained before the media came forward. TV9 CEO has been dropped from the post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X