నాకు హక్కు ఉంది: ఆస్తికోసం వదినపై దాడి కేసులో బుల్లితెర నటి శ్రీవాణి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తన వదిన అనవసరంగా తన కుటుంబాన్ని దాడి కేసులో ఇరికించిందని బుల్లితెర నటి శ్రీవాణి ఆరోపించారు. వదినపై దాడి చేసిన కేసులో నటి శ్రీవాణిపై రంగారెడ్డి జిల్లా పరిగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన వదిన అనూష పిలిస్తేనే పరిగి వెళ్లానని అన్నారు.

ఆస్తికోసం వదినపై దాడి: బుల్లితెర నటి శ్రీవాణిపై కేసు
రంగారెడ్డి జిల్లా పరిగిలో ఉన్న ఇల్లు మా నాన్న కోటేశ్వరరావు పేరిట ఉందని ఆమె చెప్పారు. తాము మొత్తం ఐదుగురు అక్కాచెళ్లెళ్లమని, మా నాన్న ఆస్తిలో మాకు హక్కు ఉంటుందని శ్రీవాణి ఈ సందర్భంగా చెప్పారు. తమకు డబ్బు సమస్య కాదని చెప్పిన ఆమె, తాను ఎవరిపైనా దౌర్జన్యానికి దిగలేదని స్పష్టం చేశారు.

తన అన్న బాబ్జీ కొంత కాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో పరిగిలోని తమ ఇంటి వద్ద ఈ స్ధలం అనూషదని బోర్డు పెట్టి ఉందని, ఆ విషయం తెలుకునేందుకు గాను నా సోదరి శ్రీకన్య కలిసి సోమవారం పరిగికి వచ్చానని ఆమె తెలిపారు. ఈ క్రమంలో మా వదిన అనూష అనవసరంగా తనతో పాటు తన కుటుంబాన్ని కేసులో ఇరికించిందని ఆరోపించారు.

ఇంటి వివాదం విషయమై జరిగిన గొడవను రంగారెడ్డి ఏఎస్పీ చందనాదీప్తికి తెలిపానని శ్రీవాణి అన్నారు. ఈ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని ఆమె చెప్పారు. నీ భర్త చనిపోయాడు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఈ భూమిని అమ్ముకోని వెళ్లిపోతానని వదిన అనూషపై గొడవకు దిగడంతో పాటు ఆమెను చెప్పలేని పదజాలంతో దుర్భాలడిందని తన ఫిర్యాదులో పేర్కొంది.

 TV Actress Sri Vani explanation on case filed on her

అంతేకాదు అనూష ఉంటున్న ఇల్లును తన భర్త ఆదిత్య రెడ్డి సాయంతో కొంత మంది అనుచరులను తీసుకుని వెళ్లి జేసీబీ‌తో కూల్చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

విచారణకు హాజరు కావాలని శ్రీవాణిని సమాచారం ఇచ్చినట్లు పరిగి సీఐ నిర్మల తెలిపారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి శ్రీవాణి వదిన అనూషతో కలిసి ఆమె గురువారం పరిగి బయల్దేరి వెళ్లారు. సంఘటనాస్థలిని పరిశీలించననున్న పోలీసులు అనంతరం సాక్షుల వాంగ్మూలం నమోదు చేయనున్నారు.

ఆస్తికోసం వదినపై దాడి: బుల్లితెర నటి శ్రీవాణిపై కేసు

కాగా శ్రీవాణి వదని అనూషకు స్థానికులు బాసటగా నిలిచారు. తన భ‌ర్త చ‌నిపోయి బాధ‌లో ఉంటే ఆమెను వేధించ‌డం ఏంటని శ్రీవాణిని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అమాయకురాలైన అనూషకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఇంటి స్థలం కోసం శ్రీవాణి ఇదే తరహా దౌర్జన్యానికి పాల్పడిందని, అయితే ఆ ప్రయత్నాలను తాము అడ్డుకున్నట్లు స్థానికులు తెలిపారు.

కాగా, మా టీవీలో వచ్చే రాములమ్మ సీరియల్‌తో పాటు చంద్రముఖి సీరియల్‌లో శ్రీవాణి ప్రేక్షకులకు బాగా సుపరిచితం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Today many cine and small screen celebrities are appearing in news for wrong issues. This type of news is also become so common in present days. Recently television actress Sri Vani joined in this list.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి