తెలుగు యాంకర్ అక్రమ సంబంధం: 13ఏళ్ల బాలుడిని టార్గెట్ చేసి!..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగు యాంకర్ గీతా భగత్ వివాహేతర సంబంధం ఆరోపణల్లో చిక్కుకున్నారు. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే గాక.. ఆస్తి కోసం తన కొడుకును, తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ శ్వేత అనే మహిళ ఆరోపించింది. భర్తను తనవైపుకు తిప్పుకుని తమ కుటుంబాన్ని నానా ఇబ్బందుల పాలు చేస్తుందని ఆమె వాపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. యాంకర్ గీతా భగత్ ఒక తెలుగు టీవీ ఛానెల్ లో వంటల కార్యక్రమంతో పాటు, మరో ఛానెల్లో ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమం నిర్వహిస్తోంది. గత సంవత్సరం మధుకర్ అనే టీవి సీరియల్ డైరెక్టర్ తో ఈమె వివాహేతర సంబంధం కొనసాగించినట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా తనను దూషించడంతో పాటు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంటూ యాంకర్ గీతా భగత్.. మధుకర్ భార్య శ్వేత(36), అతని కుమారుడు (13), శ్వేత తల్లి రాజకుమారి(74)తో పాటు పక్కింట్లో ఉండే సుబ్బారావు (70)లపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

TV Anchor Geetha Bhagath Affair with Serial Director

గీతా భగత్ ఫిర్యాదుతో శ్వేత దీనిపై స్పందించారు. గత ఎనిమిదేళ్లుగా గీతా భగత్ తమను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మధుకర్, గీతా భగత్ కలిసి తన కుమారుడిని చంపేయాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తి కోసమే తన కొడుకును వేధిస్తున్నారని, 504, 506, 509, రెడ్ విత్ 34 లాంటి సెక్షన్ల కింద తన కొడుకుపై కేసు పెట్టారని, 13 ఏళ్ల పిల్లాడికి ఏం తెలుసని అతన్ని టార్గెట్ చేశారని ప్రశ్నించారు.

శ్వేత కొడుకు మాట్లాడుతూ.. తన తండ్రి, గీతా భగత్ కలిసి అకారణంగా తన తల్లిని తిడుతుంటారని, ఇదే విషయంపై గత నెల 6న పెద్ద గొడవైందని చెప్పాడు. ఆరోజు పోలీసుల సమక్షంలోనే తన తల్లిపై దాడి చేశారని వాపోయాడు.గీతా భగత్ ఫిర్యాదుకు నిందిత బాలుడు చెప్తున్న దానికి పొంతన లేకపోవడంతో.. కేసులో న్యాయం ఎవరివైపు నిలబడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

కాగా, గతేడాది ఏప్రిల్16,2016న మధుకర్-గీతా భగత్ ల వేధింపులపై శ్వేత మానవ హక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయించింది. అయినా లాభం లేకపోవడంతో ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In public there is having very bad impression on film industry especially on cast and crew members are the part of film industry because the members who belong to film industry will maintain illegal relationships.
Please Wait while comments are loading...