కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా.. (ఫోటోలు)

హైదరాబాద్: టెలివిజన్ రంగంలో అనతి కాలంలో యాంకర్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నిరోషా బుధవారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌లో సింధి కాలనీలోని పీజీ హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ వైఫల్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అతిపిన్న వయసులోనే ఉరివేసుకుని అత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నిరోషాకు ఎందుకు వచ్చింది. అసలేం జరిగింది. తన రూమ్ మేట్, తోటి యాంకర్ పోలీసులకు ఏం చెప్పింది. జెమినీ మ్యూజిక్ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న నిరోషా వయసు 23 సంవత్సరాలు.

జెమినీ మ్యూజిక్ ఛానల్‌లో యాంకర్‌గా చేరడానికి ముందు నిరోషా పలు న్యూస్ ఛానలల్లో రిపోర్టర్‌గా కూడా పనిచేసింది. చురుకుదనం, చలాకీతనం వల్లే యాంకరింగ్ మీద ఆమెకు అమిత ఆసక్తి ఏర్పడింది. అంతేకాదు జెమినీ మ్యూజిక్ ఛానల్‌లో నిరోషా యాంకరింగ్ చేసే ప్రోగ్రామ్‌లకు అభిమానులు కూడా ఎక్కవే. నిరోషాకు గడిచిన నెలలో నిశ్చితార్థం జరిగింది.

వచ్చే నెలలో వివాహం తేదీని ఖరారు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎంతో భవిష్యత్తు ఉన్న నిరోషా ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఎంతో మందిని కలచివేస్తోంది. అయితే నిరోషా ఆత్మహత్య చేసుకోవడానికి ఓ వీడియో ఫోన్‌కాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా..

కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా..

నిరోషా ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు కెనడాలో ఉన్న బాయ్‌ఫ్రెండ్, కాబోయే భర్త రిత్విక్‌తో వీడియో ఫోన్ కాల్‌ మాట్లాడింది.

 కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా..

కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా..

ఈ క్రమంలో కాబోయే భర్తను బెదిరించాలనే ఉద్దేశంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

 కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా..

కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా..

ఈ వీడియో కాల్ సంభాషణ జరుగుతుండగానే నిరోషా తీవ్ర మనస్థాపం చెంది తాను చనిపోతున్నట్లు బెదిరించి అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో నిరోషా ఆత్మహత్యకు పాల్పడుతుందని జూబ్లిహిల్స్‌లో ఉన్న చుట్టాలకు ఫోన్ చేసి వారి సాయాన్ని సైతం రిత్విక్ కోరినట్లు సమాచారం.

 కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా..

కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా..

సమాచారం అందుకున్న నిరోషా బంధువులు, పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకునే లోపే ఆమె గదిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

 కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా..

కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా..

సీలింగ్ ఫ్యాన్‌కు తన దుప్పట్టాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునే క్రమంలో హుక్ బిగుసుకుపోవడంతోనే ఆమె చనిపోయినట్లు ఆమె రూంమేట్‌గా ఉన్న మరో యాంకర్ చెప్పారు.

 కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా..

కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా..

దీనిని బట్టి చూస్తుంటే ఆవేశంలో తీసుకున్న నిర్ణయం మూలంగానే యాంకర్ నిరోషా తన అందమైన జీవితాన్ని కోల్పోయారనే భావన కలుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా..

కాబోయే భర్తతో చాటింగ్ చేస్తూనే క్షణికావేశంలో యాంకర్ నిరోషా..

పోస్టుమార్టం నిమిత్తం నిరోషా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సీఆర్‌పీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిరోషా తల్లిదండ్రులు చిత్తూరు జిల్లాలోని మల్లేశ్వరంలో నివసిస్తున్నారు. కుమార్తె ఆత్మహత్య విషయం తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+