తాగొద్దని చెప్పిన యాంకర్ ప్రదీప్ ఇలా, వీడియో హల్‌చల్: 3 గంటల కౌన్సెలింగ్ తర్వాత కోర్టుకు (వీడియో)
Recommended Video

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31వ తేదీన రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో యాంకర్ ప్రదీప్ పట్టుబడిన విషయం తెలిసిందే. ప్రదీప్ పట్టుబడటం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ నేపథ్యంలో గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో మద్యం తాగి డ్రైవ్ చేయొద్దని ప్రదీప్ అందరికీ చెప్పారు. ఇలా నీతి వాక్యాలు చెప్పిన ప్రదీప్.. ఇవాళ తాగి దొరికిపోయాడని విమర్శలు చేస్తున్నారు.
నీతులు చెప్పి గోతిలో పడ్డారు!
ఓ వైపు తాగి డ్రైవింగ్ చేయవద్దని చెబుతున్న వీడియో, మరోవైపు తాజాగా అతను పట్టుబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రెండింటిని పక్క పక్కనే ప్లే చేస్తూ ఇలా చెప్పి, అలా చేయడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక్క తప్పు కారణంగా ఆయన పరువు పోగొట్టుకున్నాడని అంటున్నారు. నీతులు చెప్పి గతిలో పడ్డాడని అంటున్నారు.

మంగళవారం కౌన్సెలింగ్ తర్వాత కోర్టుకు
కాగా, తాగి మద్యం నడిపిన ప్రదీప్‌కు మంగళవారం పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. ప్రదీప్‌తో పాటు దొరికిన ఇతరులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తారు. ఆ తర్వాత వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రదీప్‌కు రెండు రోజుల నుంచి వారం రోజుల పాటు శిక్ష పడవచ్చునని చెబుతున్నారు.

ప్రదీప్‌కు మూడు గంటల పాటు కౌన్సెలింగ్
బేగంపేటలోని కౌన్సెలింగ్ సెంటర్‌కు మంగళవారం హాజరు కావాలని ప్రదీప్‌కు పోలీసులు ఆదేశించారు. సుమారు మూడు గంటల పాటు ప్రదీప్‌కు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మూడు డాక్యుమెంటరీల ప్రదర్శనతో పాటు నిపుణుల కౌన్సెలింగ్ ఉంటుందని తెలుస్తోంది. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.

కారు బ్లాక్ ఫిలింలు తొలగించడం పైనా కేసు?
కౌన్సెలింగ్ అనంతరం ప్రదీప్‌ను కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు చెప్పినట్లుగా సమాచారం. అలాగే, ప్రదీప్ తన కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లు తొలగించకపోవడంపై కూడా మరో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది.

కారులో అమ్మాయి కూడా ఉందా?
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన సంగతి పక్కన పెడితే, ప్రదీప్ పక్కన కారులో ఓ అమ్మాయి కూడా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. అది నిజమే అయితే ఆమె ఎవరు? అనే చర్చ సాగుతోంది. అమ్మాయి కారులో ఉన్నది నిజమే అయితే, ఆమె కూడా మద్యం మత్తులో ఉందా అనే చర్చ సాగుతోంది.

డీసెంట్‌గా కనిపించే ప్రదీప్
కాగా, గత రాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45లో జరిగిన తనిఖీల్లో ప్రదీప్ దొరికిన విషయం తెలిసిందే. ఓ పబ్బులో మందు కొట్టి వచ్చి తన టీఎస్ 07 ఈయూ 6666 కారులో డ్రైవింగ్ చేస్తూ బయలుదేరాడు. జూబ్లీహిల్స్ లో తనిఖీల్లో ప్రదీప్ దొరికాడు. డీసెంట్‌గా కనిపించే ప్రదీప్ దొరకడం చర్చకు దారి తీసింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications