బెదిరిస్తే బెదిరిపోం.. అదే జరిగితే ఏం చేయాలో తెలుసు!: చిరు, పవన్ లకు మీడియా పరోక్ష హెచ్చరిక

హైదరాబాద్: మీడియాపై పవన్ కల్యాణ్ ఆరోపణలు, ఏబీఎన్ పై ఆయన అభిమానుల దాడిని జర్నలిస్టు సంఘాలు దీన్ని తీవ్రంగా పరిగణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాపై దాడికి నిరసనగా సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలుగు టీవీ న్యూస్‌ ఎడిటర్స్‌ సమావేశం జరిగింది. మీడియాపై సినీ వర్గాలు పెత్తనం చలాయించాలనుకోవడం సరికాదని, మీడియా పట్ల వారి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు స్పష్టం చేశారు.

మీడియాను నియంత్రిస్తారా?:

మీడియాను నియంత్రిస్తారా?:

హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు రాజమౌళిచారి, విజయ్‌కుమార్‌ రెడ్డిలు సమావేశంలో మాట్లాడారు. మీడియాను నియంత్రించాలని కొంతమంది సినీ ప్రముఖులు ప్రయత్నించడం సరికాదన్నారు. ఏ కార్యక్రమం ఎంత సమయం ప్రసారం చేశారు?, ఎందుకు ప్రసారం చేశారు? లాంటి ప్రశ్నలు సినీ పరిశ్రమ నుంచి రావాల్సిన అవసరం లేదని అన్నారు. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని, మీడియాను నియంత్రించే ధోరణితో సినీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు పట్ల యావత్‌ మీడియా లోకం ఆవేదన వ్యక్తం చేస్తుందన్నారు.

అదే జరిగితే..:

అదే జరిగితే..:

అంతర్గత సమస్యలను పరిష్కరించుకోలేని స్థితిలో సినీ పరిశ్రమ ఉందని, వారి అసమర్థతను మీడియాపై నెట్టివేస్తున్నారని జర్నలిస్టులు ఆరోపించారు. మీడియాపై భౌతిక దాడులు దిగితే సహించేది లేదని తేల్చి చెప్పారు. మీడియాపై నిషేధం విధించాలని సినీ పెద్దలు భావిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అదే జరిగితే మా కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీడియాపై నిషేధం విధించాలని చూస్తే దానికి ఏ విధంగా స్పందించాలో తమకు తెలుసన్నారు.

అజ్ఞానంతో మీడియాపై..:

అజ్ఞానంతో మీడియాపై..:


సినీ రాజకీయ నేతలు అపరిపక్వతతో, అజ్ఞానంతో మీడియాకు కుల జాడ్యం అంటిస్తున్నారని, తమ అనుచరగణాన్ని రెచ్చగొట్టి దాడి చేయించడానికి ప్రయత్నిస్తున్నారని టీవీ ఎడిటర్స్ ఆరోపించారు. టీవీ చానెల్స్‌ శ్రీరెడ్డిని, ఆమె సహచరులను చూపించడం, ఆమెబాధలను చెప్పుకునే అవకాశం కల్పించడం ఏమాత్రమూ తప్పుకాదన్నారు. శ్రీరెడ్డి సమస్య మీరు పరిష్కరించుకోలేక మీడియాపై పడడం దుర్మార్గం అన్నారు.

 బెదిరిస్తే బెదిరిపోం..:

బెదిరిస్తే బెదిరిపోం..:

సినిమా పరిశ్రమ ఈమధ్య రహస్య మీటింగ్‌లు పెట్టుకుని మీడియాను శాసించాలని చూస్తోందని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు క్రాంతి అన్నారు. క్యాస్టింగ్‌ కౌచ్‌పై పరిష్కారం చూపకుండా మీడియాపై దాడికి దిగడం సరికాదన్నారు. బెదిరిస్తే బెదిరిపోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరని, ఇకనైనా ఆ ధోరణి మానుకోవాలని హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+