కేటీఆర్ వర్సస్ షర్మిల - ట్వీట్ వార్ : దమ్మంటే మాట్లాడండి - ఫ్యాన్స్ ట్రోలింగ్..!!
మంత్రి కేటీఆర్ పైన వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ తన కాలికి ఫ్రాక్చర్ అయిన సమయంలో తాను ఇక ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని.. మంచి సినిమా ఓటీటీలో సూచించాలని ట్వీట్ చేసారు. దీనికి షర్మిల స్పందించారు. ట్విట్టర్ వేదికగా సెటైరికల్ గా రిప్లై ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని సూచిస్తూనే...క్లౌడ్ బస్టర్ గురించి చూడాలని..పంప్ హౌస్ లు - గ్రామాలు మునిగిపోవటం గురించి చూడాలంటూ సూచించారు. దీని పైన టీఆర్ఎస్ శ్రేణులు కామెంట్స్ పెట్టారు. దీంతో..షర్మిల ఆగ్రహానికి గురయ్యారు. మంత్రి కేటీఆర్ పైన ఫైర్ అయ్యారు.
చిన్న దొర గారికి కోపం వచ్చింది
ఓటీటీలో సినిమాల కోసం సలహా అడిగితే మేం వెటకారంగా ట్వీట్ చేశామని చెప్పుకొచ్చారు. తాము పోస్టు చేసిన ట్వీట్లతో చిన్న దొర గారికి కోపం వచ్చిందని ఎద్దేవా చేసారు. తమ పై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారని చెప్పుకొచ్చారు. దమ్ముంటే సబ్జెక్టు మాట్లాడండంటూ సవాల్ చేసారు. అధికారం చేతుల్లో ఉంది, పాలన చేతుల్లో ఉంది, ఇంట్లో కూర్చుని షోలు, సినిమాలు చూస్తారా అంటూ నిలదీసారు. సీఎం తరువాతి స్థానంలో ఉన్న వ్యక్తి కాలికి దెబ్బ తగిలితే ఇంట్లో కూర్చొంటారా అంటూ ప్రశ్నించారు.

మహిళ అని లేకుండా కామెంట్స్ చేస్తారా
తాను ఒక మహిళ అని చూడకుండా.. వివాహం అయిన మహిళ అని లేకుండా విమర్శలు చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఇంట్లో నుంచి రిమోట్‌గా పని చేయలేరా..గతంలో అందరూ చేయలేదా అంటూ దుయ్యబట్టారు. కరోనా సమయంలో మనమందరం పని చేయలేదా అంటూ ప్రశ్నించారు. వరదలొచ్చి ఒక పక్క రైతులు నష్టపోయారని.. ఇళ్లు కోల్పోయారని చెప్పుకొచ్చారు. కష్టాల్లో ఉన్న వాళ్లకు ఒక్క రూపాయి సాయం చేయలేదని మండి పడ్డారు. ఓటీటీ సినిమాలు చూస్తామంటూ ట్వీట్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు ఏం హామీలిచ్చి అదికారంలోకి వచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు. ఏ హామీలు నెరవేర్చకుండా సిగ్గు లేకుండా మహిళ పై వ్యక్తిగతం విమర్శలు చేస్తున్నారంటూ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ట్వీట్లు - ట్రోలింగ్
ఇదే సమయంలో షర్మిల తన ట్విట్టర్ ఖాతా ద్వారా కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ తో మంత్రి అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. అందులో మీ కుటుంబ విషయాలు చూసుకోవాలంటూ పోస్టింగ్ ల సైతం ఉన్నాయి. దీంతో..తన తో అంశాల వారీగా చర్చ కాకుండా.. ఇలా వ్యక్తిగతంగా ట్రోలింగ్ ఏంటని షర్మిల నిలదీస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో షర్మిల వర్సెస్ కేటీఆర్ పొలిటికల్ వార్. .కొత్త టర్న్ తీసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications