నిజామాబాద్ లో జంట హత్యల కలకలం ...గది నుండి దుర్వాసన రావటంతో బయటపడ్డ జంట హత్యలు

నిజామాబాద్ లో జంట హత్యల ఘటన కలకలం రేపుతోంది. ఇద్దరు యువకుల దారుణ హత్య నిజామాబాద్ నగరంలో స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. గది నుండి దుర్వాసన రావటంతో జంట హత్యల విషయం బయట పడింది .

స్థానిక కంఠేశ్వర్ కాలనీలోని ఓ ఇంట్లో నాలుగు నెలల నుంచి ముగ్గురు యువకులు నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్, సాయి, మహేష్ అనే ముగ్గురు యువకులు కంఠేశ్వర్ ప్రాంతంలో ఒక టీ కొట్టు నిర్వహిస్తున్నారు. వీరు ముగ్గురు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. అయితే వీరిలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. ఆ యువకులు నివసిస్తున్న గది నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని గది తలుపులు తీసి చూడటంతో ఈ హత్యల సంగతి బయటపడింది.

Twin murders in Nizamabad ...murders came into light because of the stink

మూడు రోజుల క్రితం హత్యలు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వీరిలో మరో యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు వీళ్ళు ఎవరు ? వీరిని ఎవరు ఎందుకు హతమార్చారు? వీరితో పాటు ఉన్న మరో వ్యక్తే ఈ హత్యలకు పాల్పడ్డారా ? వంటి అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీం లతో ఆధారాలు సేకరిస్తున్నారు. నగర ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+