• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉస్మానియాలో ట్విన్ టవర్స్: కెసిఆర్(ఫొటో)

|

హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. విధులను నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని తక్షణమే మార్చాలని ఆదేశించారు.

ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌ తదితర బోధనాసుపత్రుల పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో బుధవారం వైద్యారోగ్యంపై సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు ఏడుగంటలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి, కొత్త ఆస్పత్రుల ఏర్పాటు, ఉద్యోగ ఖాళీల భర్తీపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశంలో బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కె లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మ, వైద్యశాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ తదితర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో సరైన వైద్య విధానాన్ని రూపొందించడానికి త్వరలోనే వైద్యులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

 Twin towers to come up in Osmania General Hospital: KCR

‘ఉస్మానియా ఆస్పత్రిలో 20 లక్షల చదరపు అడుగులతో 24 అంతస్తుల రెండు భారీ భవనాలను నిర్మిస్తాం. ప్రస్తుత సాంస్కృతిక వారసత్వ భవనంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. నిలోఫర్‌ ఆసుపత్రిని వెయ్యి పడకలకు అభివృద్ధి చేస్తాం. కొత్తగా అందుబాటులో ఉన్న భవనాన్ని సత్వరమే వినియోగంలోకి తీసుకురావాలి. ప్రస్తుతమున్న నిలోఫర్‌ భవన స్థానంలో బహుళ అంతస్తుల నూతన భవనాన్ని నిర్మిస్తాం' అని చెప్పారు.

ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులు వివిధ విభాగాల కింద పనిచేస్తున్నాయి. వైద్యులు కూడా ఆయా విభాగాల వారీగా విడిపోయారు. వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలి. వైద్య విధానపరిషత్‌ స్థానంలో కొత్త విభాగాన్ని నెలకొల్పాలి. 20 నుంచి 25 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, జిల్లా కేంద్రాల్లో వెయ్యి పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాం. జిల్లా ఆసుపత్రులను నిమ్స్‌ తరహా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులుగా, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను 2వేల పడకల ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతాం' అని తెలిపారు.

ఆదిలాబాద్‌ రిమ్స్‌, నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రులను 500 నుంచి 1000 పడకలకు, వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిని 1000 నుంచి 2000 పడకలకు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి. ఆసుపత్రుల్లో పూర్తి స్థాయి సిబ్బంది, వైద్యపరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తాం. ఐదేళ్లు, పదేళ్లు, 15 ఏళ్లు.. ఎంత ఎక్కువ కాలం గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ఆ కాలపరిమితిని బట్టి ప్రోత్సాహకాలుంటాయి' అని సిఎం తెలిపారు.

ఆసుపత్రుల్లో వైద్యపరికరాల మరమ్మతుకు బయోమెడికల్‌ ఇంజినీర్లను ప్రతి జిల్లాకు నియమిస్తాం. వైద్యశాలల్లో స్వల్ప సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్లకు రూ.1.50 కోట్లను కేటాయిస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంతమంది రోగులు వస్తున్నారు? ఎంతమంది చికిత్స కోసం చేరుతున్నారనే అంచనాలేవీ లేవు. వీటిపై దృష్టిసారించాలి. ఆసుపత్రుల్లో రోగుల కోసం ప్రత్యేక వసతిగృహాలు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలి. రెవెన్యూ జిల్లాల ప్రాతిపదికన కాకుండా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా 'ఆరోగ్య జిల్లాలు' ఏర్పాటు చేయాలి'' అని సీఎం అధికారులకు సూచించారు.

ఎంఎస్‌ఐడీసీపై మండిపాటుతెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) పనితీరులో పారదర్శకత లోపించిందని సీఎం మండిపడ్డారు. ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో వైద్యులు సమయపాలన పాటించడం లేదనే అంశంపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా బోధనాసుపత్రుల పరిస్థితి అత్యంత దరిద్రంగా ఉందని వైద్య విద్య సంచాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.

బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వర్తిస్తున్న వైద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలనీ, దీర్ఘకాలంగా ఒకేచోట ఉద్యోగం చేస్తున్న వైద్యులు, సిబ్బందిని తక్షణమే మార్చాలని ఆదేశించారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a surprise announcement, Chief Minister K. Chandrasekhar Rao told health officials that twin towers would be constructed on the premises of the Osmania General Hospital and the old building of the Niloufer Hospital would be demolished to make way for a new building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more