బ్యూటీషియన్ మృతిలో ఎస్సై లింక్?: భర్త స్పందన, రాత్రి అక్కడ ఎందుకు ఉంది?
తన భార్య శిరీష మృతికి కారణాలు తెలియదని బ్యూటీషియన్ భర్త సతీష్ చంద్ర బుధవారం అన్నారు. ఫిలిం నగర్‌లో ఓ బ్యూటీషియన్ తాను పని చేసే స్టూడియోలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం సృష్టించిన విషయం
హైదరాబాద్: తన భార్య శిరీష మృతికి కారణాలు తెలియదని బ్యూటీషియన్ భర్త సతీష్ చంద్ర బుధవారం అన్నారు. ఫిలిం నగర్‌లో ఓ బ్యూటీషియన్ తాను పని చేసే స్టూడియోలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో సరికొత్త విషయం కూడా వెలుగు చూసింది. సిద్దిపేట జిల్లాలో కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. శిరీష ఆత్మహత్యతో ప్రభాకర్ రెడ్డికి సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.

కారణం తెలియదు
ఈ నేపథ్యంలో బ్యూటిషియన్ శిరీష భర్త స్పందించాడు. తన భార్య మృతికి కారణాలు తెలియవని చెప్పాడు. తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది మాత్రం కాదని చెప్పాడు. మరణంపై అనుమానాలు ఉన్నాయని, పోలీసులు సమగ్రంగా విచారణ జరిపితే అసలు విషయం బయటకు వస్తుందన్నారు.

ఎస్సైకి సంబంధమంటూ..
శిరీష ఆత్మహత్యతో ప్రభాకర్ రెడ్డికి సంబంధం ఉందని, తాజాగా మద్యం మత్తులో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఆమె సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుందని, విషయం తెలిసి తనకు ఇబ్బందులు వస్తాయని ప్రభాకర్ రెడ్డి బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.

ముగ్గురి మధ్య విభేదాలు..
ఇదిలా ఉండగా, శిరీష, రాజీవ్, అతని స్నేహితుడు శ్రవణ్‌లు.. శిరీష ఆత్మహత్యకు ముందు బయటకు వెళ్లి వచ్చినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరు ముగ్గురు కలిసి మద్యం సేవించారని గుర్తించారు. ముగ్గురికి విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది.

అర్ధరాత్రి వరకు గొడవ
వీరి మధ్య మంగళవారం తెల్లవారుజాము రెండున్నర గంటల వరకు పంచాయతీ కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిరీషది ఆత్మహత్యనా, హత్యనా అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. శిరీష స్నేహితుడు రాజీవ్‌ను విచారించగా ఆయన ఉరేసుకుందని ఓసారి, బాత్రూంలో ఆత్మహత్య చేసుకుందని మరోసారి చెప్పాడని తెలుస్తోంది. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

రాత్రి అక్కడే ఎందుకు ఉంది?
కాగా, శ్రీనగర్ కాలనీకి చెందిన శిరీషా షేక్‌పేట ఆర్‌జే ఫొటోగ్రఫీ స్టూడియోలో బ్యూటీషియన్‌గా చాలా కాలంగా పని చేస్తోంది. వివాహాలు, ఇతరాత్ర శుభాకార్యాల నిమిత్తం ఈ స్టూడియోలో ఫొటోలు దిగడానికి వచ్చే వారికి శిరీషా మేకప్ చేసేంది. రోజు లాగే సోమవారం షేక్‌పేటలోని ఫొటోగ్రఫీ కార్యాలయానికి వెళ్లింది. తిరిగి సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం ఫొటోగ్రఫీ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా అందులోనే ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిసింది. దీంతో కుటుంబీకులు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. రోజు సాయంత్రం ఇంటికి రావాల్సిన యువతి రాత్రి అక్కడే ఎందుకుంది..? ఆ రాత్రి అక్కడ ఏం జరిగిందో తెలియాల్సి ఉందంటున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications