ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు: ఆసుపత్రిలోనే రాజేష్ ఆత్మహత్యాయత్నం, అన్నా, స్వాతి ఎక్కడంటూ యాక్షన్...

Recommended Video

    రాజేష్ ఆత్మహత్యాయత్నం, అంతా వాట్సాప్ నే ! స్వాతి కేసులో ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు

    నాగర్‌కర్నూల్: సుధాకర్ రెడ్డి స్థానంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ ఆసుపత్రిలోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించడంతో అతను ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.

    వివాహేతర సంబందాన్ని ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు రాజేష్, స్వాతి వేసిన ప్లాన్ బెడిసికొట్టింది.సుధాకర్ రెడ్డి తల్లి దండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వేసిన ప్లాన్‌లో స్వాతి, రాజేష్ చిక్కారు.

    సుధాకర్ రెడ్డిగానే జీవితాంతం కొనసాగేలా స్వాతి పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. అయితే ఈ ఘటనలో స్వాతిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేష్ కూడ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

    ఆసుపత్రిలోనే ఆత్మహత్యాయత్నం చేసిన రాజేష్

    ఆసుపత్రిలోనే ఆత్మహత్యాయత్నం చేసిన రాజేష్

    హైద్రాబాద్ ఆసుపత్రిలో రాజేష్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సుధాకర్‌రెడ్డిగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌కు అనుమానం రాకుండా పోలీసులు కుటుంబసభ్యులు వ్యవహరించారు. అయితే ఎట్టకేలకు రాజేష్, స్వాతిల వ్యవహరం బట్టబయలైందని తేలడంతో ఆసుపత్రిలోనే రాజేష్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రి కిటికీ గుండా దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణాలతో రాజేష్ బయటపడ్డాడు.

    స్వాతితో పాటు అన్నా ఎక్కడంటూ రాజేష్ ఆరా

    స్వాతితో పాటు అన్నా ఎక్కడంటూ రాజేష్ ఆరా


    మటన్ సూప్‌తో విషయం అనుమానాలు బలపడడంతో పోలీసులు రాజేష్ ఆధార్ వేలి ముద్రలను సేకరించి రాజేష్ ఆధార్‌తో సరిపోల్చారు. ఈ వేలిముద్రలు రాజేష్‌తో సరిపోయాయి. దీంతో స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. అసలు విషయాన్ని స్వాతి బయటపెట్టింది.విచారణ కోసం స్వాతిని ఆసుపత్రి నుండి పోలీసులు తీసుకురావడంతో రాజేష్‌కు అసలు విషయాలు తెలియదు. మూడురోజులుగా స్వాతి ఎక్కడికెళ్ళిందంటూ పదే పదే ఆరా తీశాడు. మరో వైపు తన సోదరుడు ఎక్కడికెళ్ళాడంటూ ఆసుపత్రి సిబ్బందిని రాజేష్ ఆరా తీశారు.

    రాజేష్‌పై సుధాకర్‌రెడ్డి కుటుంబసభ్యులకు అనుమానం

    రాజేష్‌పై సుధాకర్‌రెడ్డి కుటుంబసభ్యులకు అనుమానం

    యాసిడ్ దాడి జరిగిందని ముఖానికి బ్యాండేజీ ఉంది. అయితే సుధాకర్ రెడ్డి గొంతులో తేడా ఉందని కుటుంబసభ్యులు అనుమానించారు. అంతేకాదు అతని శరీరంలో కూడ మార్పు కన్పిస్తోందని, మనిషి ప్రవర్తనలో కూడ తేడా ఉందని వారు అనుమానపడ్డారు. అయితే యాసిడ్ దాడి కారణంగానే ఇది జరిగిందని కుటుంబసభ్యులు అనుమానించారు. ముఖానికి బ్యాండేజీ తీసిన తర్వాత సుధాకర్ రెడ్డి పోలికలు మాత్రం లేవనే అనుమానాలు ఉండేవి. అయితే మటన్ సూప్‌ తాగనని రాజేష్ చెప్పడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.

    ఆ తప్పులే స్వాతిని పట్టించాయి

    ఆ తప్పులే స్వాతిని పట్టించాయి

    స్వాతికి రాజేష్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే సుధాకర్ రెడ్డికి ఈ విషయం తెలియడంతో ఆయననను చంపేందుకు కూడ స్వాతి వెనుకాడలేదు.మటన్ సూప్‌తో పాటు , ఆధార్ కార్డు, రాజేష్ ప్రవర్తనతో పాటు స్వాతిపై వివాహేతర ఆరోపణలు రావడంతో పోలీసులు వేసిన ప్లాన్ వర్కవుట్ అయింది. సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్ట్ చేశారు.

    స్నేహితుడి సమాచారం ఆధారంగా

    స్నేహితుడి సమాచారం ఆధారంగా


    స్వాతి వేరే వ్యక్తితో తిరుగుతున్న విషయాన్ని స్నేహితుడి ద్వారా సుధాకర్‌రెడ్డి తెలుసుకొన్నాడు. మోటార్ బైక్‌పై స్వాతి రాజేస్ మహబూబ్ నగర్ పట్టణానికి వెళ్ళారని, ఆ విషయాన్ని సుధాకర్ రెడ్డి స్నేహితుడు చూసి ఫోన్ చేశారు. దీంతో స్వాతిని సుధాకర్‌రెడ్డి నిలదీయడంతో భార్య, భర్తల మధ్య నవంబర్ 26వ,తేదిన ఘర్షణ చోటుచేసుకొంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+