లిబియాలో కిడ్నాప్: శ్రీకాకుళం, హైద్రాబాద్‌వాసులు సహా వీరే, గోపీకృష్ణ భార్య ఆందోళన
న్యూఢిల్లీ/హైదరాబాద్: లిబియాలో అపహణకు గురైన వారిలో ముగ్గురు కర్నాటక వాసులు, ఒకరు తెలంగాణవారిగా తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఇద్దరు కర్నాటకవాసులు, ఇద్దరు హైదరాబాద్ వాసులు అని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారని, అందులో ఇద్దరు కర్నాటకవాసులు, ఇద్దరు హైదరాబాద్ వారు ఉన్నారని చెప్పారు. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
కిడ్నాపైన తెలుగువారిలో గోపీకృష్ణ, బలరామ్ ఉన్నారు. గోపీకృష్ణ శ్రీకాకుళం జిల్లా టెక్కలివాసి. కాగా, బలరాం హైదరాబాదుకు చెందిన వారు. కర్నాటకకు చెందిన ఇద్దరి పేర్లు... లక్ష్మీకాంత్, విజయ్ కుమార్‌లుగా తెలుస్తోంది.

నా భర్త కిడ్నాప్‌కు గురైనట్లు సమాచారం వచ్చింది: కళ్యాణ్
తన భర్త గోపీకృష్ణను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లుగా సమాచారం అందిందని గోపీకృష్ణ భార్య కళ్యాణ్ చెప్పారు. విధులకు వెళ్తుండగా డ్రైవర్‌ను దించి వెళ్తుండగా కిడ్నాప్ జరిగిందని తెలుస్తోందన్నారు.
గోపీకృష్ణ ఏడేళ్లుగా లిబియాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారని చెప్పారు. తన భర్తను విడిపించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరు కిడ్నాప్ చేసారనే విషయం తెలియాల్సి ఉందని, ఐసిస్ తీవ్రవాదులుగా వార్తలు వస్తున్నప్పటికీ, ఎవరు చేశారో తెలియాల్సి ఉందని గోపీకృష్ణ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications