టిప్పర్ రూపంలో మృత్యువు: బిటెక్ విద్యార్థుల కలలను చిదిమేసింది

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇద్దరు బిటెక్ విద్యార్థులను మృత్యువు టిప్పర్ రూపంలో కబళించింది. బిటెక్ పూర్తి చేసుకున్న వారిద్దరు సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి వెళ్లి శవాలై మిగిలారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఈ ప్రమాదం జరిగిది.

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన శీల రామచందర్, ఎల్లమ్మ దంపతుల కుమారుడు మహేష్‌(22), రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌ నగర పంచాయతీకి చెందిన గూడురూ రాంబాబు కుమారుడు లోకేష్‌ దుర్గా ప్రసాద్‌(22)లు ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి సమీపంలోని భారత్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ (ఈఈఈ) చదివారు.

Two BTech students killed in Ranga Reddy district

శీల మహేష్, దుర్గాప్రసాద్‌ ఇద్దరు కలిసి సోమవారం సర్టిపికెట్లు తెచ్చుకోవడానికి కళాశాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదిబట్ల టీసీఎస్‌ రోడ్డు వైపు వస్తుండగా బొంగ్లూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఆదిబట్ల గ్రామం వైపు వెళ్తున్న టిప్పర్‌ వారి బైక్‌ను ఢీకొట్టింది. దాంతో టిప్పర్‌ వెనక చక్రాల కింద పడిపోయారు.

దాంతో మహేష్, లోకేష్‌కుమార్‌ అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఆదిబట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. మహేష్‌ బ్యాగులో భారత్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఐడీ కార్డు లభించడంతో వీరు భారత్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు.

Two BTech students killed in Ranga Reddy district

ప్రస్తుతం వారిద్దరు హైదరాబాదులోని దిల్‌సుఖ్‌నగర్‌లో విశ్వ కోచింగ్‌ సెంటర్‌లో గేట్‌ కోచింగ్‌ తీసుకున్నట్లు వారి వద్ద ఉన్న ఐడీ కార్డుల ఆధారంగా తెలిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BTech students killed in a road accident near Adibtla in Ranga Reddy dsitrict of Telangana

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి