తెలంగాణలో పాఠశాలలకు వరుసగా రెండు రోజులు సెలవు..!!
తెలంగాణలో పాఠశాలలకు వరుసగా రెండు రోజులు సెలవు ప్రకటించారు. ఈ నెల 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో, ఆ రోజు..ముందు రోజు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 1.06 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాలుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు సిబ్బంది ముందు రోజు మధ్నాహ్నం నుంచే చేరుకుంటారు.
దీంతో ఎన్నికల విధులు..పోలింగ్ నిర్వహణకు వీలుగా రెండు రోజులు సెలవులు ఇస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎలను తీసుకొనేందుకు ఉపాధ్యాయులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ నెల 29,30 తేదీల్లో బడులకు సెలవులని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సెలవుల విషయాన్ని ఎన్నికల సంఘం సూచన మేరకు అధికారికంగా ప్రకటన చేయనున్నారు. పోలింగ్ పూర్తయ్య ఈవీఎంలను తీసుకొని ఆయా కేంద్రాలకు వెళ్లి సమర్పించి వచ్చే సరికి అర్దరాత్రి దాటుతుందని, అందువల్ల విధుల్లో పాల్గొన్న వారికి డిసెంబర్ 1 కూడా సెలవు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.

తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులకు ప్రధాన విధులు కేటాయిస్తున్నారు. వారికి శిక్షణ కూడా కొనసాగుతోంది. ఈ నెల 28వ తేదీన ప్రచార పర్వం ముగియనుంది. ఈ నెల 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది, శాంతి భద్రతల ఏర్పాట్ల గురించి ఇప్పటికే సమీక్షలు పూర్తయ్యాయి. ప్రత్యేక అధికారులను నియమించారు. పూర్తి భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరగనుంది. దీంతో, పోలింగ్ వేళ రెండు రోజులు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వాలని భావిస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications