మద్యం మత్తులో కారుతో ఢీకొట్టాడు: ఫ్లైఓవర్ నుంచి స్కూటీ కిందపడి ఇద్దరు మృతి
కరీంనగర్‌లో హైదరాబాద్ ప్రమాదం రిపీట్ అయింది. ఓ కారు వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టడంతో ఫ్లైఓవర్ నుంచి కింద పడి ఇద్దరు మరణించారు.
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాదు నగరంలో కొన్నాళ్ల క్రితం జరిగిన సంఘటన పునరావృతమైంది. ఓ కారు వెనక నుంచి వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దాంతో స్కూటీపై ఉన్న తండ్రీకొడుకులు ఫ్లైఓవర్ నుంచి కిందపడి ప్రాణాలు వదిలారు.
ఆ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. మద్యం మత్తులో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి కారును వేగంగా నడిపి స్కూటీని ఢీకొట్టాడు. స్కూటీపై వెళ్తున్న వారిలో అక్కడికక్కడ తండ్రి, చికిత్స పొందుతూ కొడుకు మరణించాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన అబ్దుల్ సాజిద్ (30) కరీంనగర్ మండలం దుర్శేడ్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడిపిస్తున్నాడు.

తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లో ఉన్న తన తల్లిని చూసేందుకు ఆదివారం భార్యాపిల్లలతో కలిసి బైక్‌పై వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్నాడు. నగర శివారులోని ైప్లెఓవర్ మీదికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఢీకొంది.
దీంతో సాజిద్, అతడి భార్య రజియా సుల్తానా (25), కొడుకు వాజిద్(3) ైఫ్లె ఓవర్ నుంచి పడిపోయారు. మరో చిన్న కూతురు ముస్కాన్ (1)ైఫ్లె ఓవర్‌పైనే పడిపోయింది. ఈ ఘటనలో సాజిద్ అక్కడికక్కడే చనిపోగా, భార్యాపిల్లలను ఆస్పత్రికి తరలించారు. వాజిద్ చికిత్స పొందుతూ మృతి చెందగా, భార్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చిన్నారి ముస్కాన్ ప్రాణాలతో బయటపడింది.
సమాచారం తెలుసుకున్న టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ ఆరిఫ్ ఆస్పత్రికి వెళ్లి, క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన చికిత్స కోసం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి రజియాను మరో ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ గౌడ్ తెలిపారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications