Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏటూరునాగారం సమీపంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు కారు బోల్తా...

తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కారు బోల్తా కొట్టింది.ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రధాన రహదారిలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. జీడివాగు సమీపంలో బైక్‌ను ఓవర్ టేక్ చేసే క్రమంలో కారు బోల్తా కొట్టినట్లు చెబుతున్నారు. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే కారులో లేకపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది.అయితే కారులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు స్వల్పంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

దసరా పండుగ నేపథ్యంలో తన సోదరిని ఇంటికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే కాంతారావు తన డ్రైవర్‌ను పంపించినట్లు తెలుస్తోంది. ఏటూరునాగారం చేరకముందే కారు ప్రమాదానికి గురైంది.ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

two drivers injured after pinapaka mla rega kantharao car over turned

పరకాలలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ

పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి లబ్దిదారులకు అందజేశారు.దసరా కానుకగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయడంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాల నియోజకవర్గ ప్రజలకు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందుతున్న లబ్ధిదారులకు ప్రత్యేకంగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలోని నిరు పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు. పండుగల వేళ ఇంటికి కొత్త అల్లుళ్లు వస్తే అంతా కలిసి సౌకర్యంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించడం జరిగిందన్నారు.

Recommended Video

    డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్న టీటీడిపి

    అతిత్వరలో సొంత భూమి వున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించే పథకం కూడా ప్రారంభమవుతుందని వెల్లడించారు. గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు కేసీఆర్ మాత్రమే రైతులకు మంచి జరిగే పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటాయని సీఎం కేసీఆర్ భావించారని... అందుకు అనుగుణంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. ఈ దసరా పండుగ కానుకగా అర్హులైన నిరుపేదలకు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అంకితం చేస్తున్నామని చెప్పారు

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+