ట్రెక్కింగ్‌కు వెళ్లి టెక్కీ సహా మరో హైదరాబాదీ అదృశ్యం
బెంగళూరు: ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఇద్దరు హైదరాబాదీలు కర్ణాటకలోని బాబా బుదంగిరీ హిల్స్‌లో అదృశ్యమయ్యారు. వారి కోసం సోమవారమంతా గాలించారు. గాలింపు చర్యలను సోమవారం సాయంత్రం ఏడు గంటలకు చీకటి కారణంగా ఆపేశారు. మళ్లీ మంగళవారం ఉదయం గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి.
వివేక్ గుప్తా (31) అనే ల్యాబ్ టెక్నీషనియన్‌తో పాటు శశిధర్ (27) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చిక్‌మంగళూరు కొండ ప్రాంతాల్లో కనిపించకుండా పోయారు. అటవీ ప్రాంతానికి అలవాటు పడిన అటవీ అధికారులను వారి గాలింపు కోసం రప్పించారు.
వివేక్, శశిధర్ హైదరాబాదు నుంచి 11 మంది సభ్యుల బృందంలో భాగంగా ట్రెక్కింగ్‌కు వచ్చారు. ఈ బృందం ముల్లయ్యనగిరి కొండ ప్రాంతానికి చేరుకుని బాబా బుదంగిరి హిల్స్ నుంచి కిందికి దిగింది. అదృశ్యమైన ఇద్దరి కోసం పోలీసులు, అటవీ అధికారులు, అడ్వెంచర్ క్లబ్ సభ్యులు ఆదివారంనాడు గాలింపు చర్యలు చేపట్టారు.

మిగతావారి కన్నా అదృశ్యమైన ఇద్దరు ధైర్యసాహసాలు ప్రదర్శించారని, వారు కెమ్మనగుండి ప్రాంతంలో గలికెరేలో కనిపించుకండా పోయారని అంటున్నారు. బృందంలోని ఇతర సభ్యులు గాలించినా వారిద్దరు కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వర్షం కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. పోలీసులు స్థానికుల సహాయం కూడా కోరారు. మొబైల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల కూడా వారిని గుర్తించడం కష్టంగా ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. ట్రెక్కింగ్ కోసం పోలీసుల అనుమతి లేదని చెబుతున్నారు. సొంతంగా వారు ట్రెక్కింగ్‌కు వెళ్లారని చెబుతున్నారు.
వారిద్దరు బతికి ఉండడం కష్టమేనని అంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులే కాకుండా పులులు, ఇతర వన్యమృగాలు వారి ప్రాణాలకు అపాయం తలపెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications