ఉక్రెయిన్‌లో హైదరాబాదీ విద్యార్థుల దుర్మరణం: ప్రాణం తీసిన బీచ్ వాలీబాల్..
ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వీరిద్దరు బీచ్ వాలీబాల్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతయ్యారు.
కీవ్: ఉక్రెయిన్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు దర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ కు చెందిన వీరిద్దరు వైద్య విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లారు. మృతి చెందిన విద్యార్థులను హైదరాబాద్ హయత్ నగర్ కు చెందిన శివకాంత్ రెడ్డి, బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన అశోక్ మూర్తిలుగా గుర్తించారు.

ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వీరిద్దరు బీచ్ వాలీబాల్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతయ్యారు. బాల్ సముద్రంలో పడటంతో.. దానిని తీసుకురావడానికి వెళ్లగా.. రాకాసి అలలు ఇద్దరిని సముద్రంలోకి లాక్కెళ్లాయి. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications