హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'నేను ముఖ్యమంత్రిగా': గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆదివారం గజ్వేల్‌కు వచ్చి కోమటిబండలో మిషన్ భగీరథ ఫలాలను ప్రజలకు అందించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగంలో రెండు తప్పులు దొర్లాయి. తమ రాష్ట్రాల్లో పంట పొలాల కోసం ఎరువులు కావాలని రాష్ట్రాలు విజ్ఞప్తులను ప్రస్తావించిన సందర్భంలో మోడీ "నేను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి" అనే బదులు "నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి" అన్నారు.

ఆ తర్వాత ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన నెల రోజులకు హైదరాబాద్‌కు విముక్తి కలిగిందని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం (1947 ఆగస్టు 15) వచ్చిన నెల తర్వాత హైదరాబాద్‌కు స్వాతంత్య్రం లభించింది అని అన్నారు. వాస్తవానికి ఆగస్టు 15, 1947న స్వతంత్ర్యం వస్తే 13 నెలలకు సెప్టెంబర్ 17, 1948లో ఆనాటి భారత సైన్యం నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన సంగతి తెలిసిందే.

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

గజ్వేల్‌లో జరిగిన బహిరంగ సభలో నలుగురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రముఖులు పాల్గొన్నప్పటికీ ప్రసంగించింది మాత్రం కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధానమంత్రి మోడీ మాత్రమే. దత్తాత్రేయ తెలుగులో మాట్లాడగా, కేసీఆర్‌, మోడీ హిందీలో ప్రసంగించారు.

 గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

కేసీఆర్‌ హిందీలోనే ప్రసంగం ప్రారంభించి, హిందీతోనే ముగించారు. మద్యలో ఒకటి రెండు పర్యాయాలు తెలుగులో ప్రస్తావించారు. తదుపరి తన స్వాగత పలుకులు, శుభాకాంక్షలను ప్రధాని తెలుగులో తెలిపారు. 20 నిముషాలపాటు కేసీఆర్‌, 40 నిముషాలపాటు మోడీ ప్రసంగించారు.

 గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

ప్రధాని మోడీకి అర్థం కావడం కోసం హిందీలో ప్రసంగించిన కేసీఆర్‌, ప్రజల కోసం కొన్నిసార్లు తెలుగులో సందేశమిచ్చారు. హిందీలో ధారాళంగా మాట్లాడిన కేసీఆర్‌... చివర్లో తనకు హిందీ అంతా బాగా రాదనీ, అయితే తన ఉద్దేశాన్ని మోడీకి చేర్చడంలో సఫలమైనట్టే భావిస్తాననీ వ్యాఖ్యానించడం విశేషం.

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న దత్తాత్రేయకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమిత ప్రాధాన్యం ఇచ్చినట్టు కన్పించింది. ముందురోజు సభ ఏర్పాట్లను పర్యవేక్షించడంతోపాటు కార్యక్రమంలో స్వాగతోపన్యాసం చేశారు. తెలంగాణవాది, స్వతహాగా సౌమ్యుడైన దత్తాత్రేయతో మొదట్నుంచీ రాష్ట్ర ప్రభుత్వం సత్సంబంధాలు కొనసాగిస్తోంది.

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

మిషన్‌ భగీరథ పనులపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మోడీ ఆసక్తిగా తిలకించారు. అంతకుముందు నల్లా (ట్యాప్‌) తిప్పి నీళ్లు వదిలిన ప్రధాని మోడీ, అక్కణ్నుంచి వెళ్లిపోయే ముందు నల్లా ఆపేశారు. ఆ తర్వాత తన ప్రసంగంలోనూ నీటి పొదుపు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

ప్రధాని పర్యటన ఆటంకాలు లేకుండా విజయవంతం కావడం కోసం ఆ ప్రాంగణంలో ఉదయమే సుదర్శనయాగం నిర్వహించారు. కోమటిబండపైకి మోడీ రాగానే పూర్ణకలశంతో స్వాగతం పలికిన వేదపండితులు, యాగ హోమగుండ విభూదిని మోడీకి, కేసీఆర్‌కు తిలకంగా దిద్దారు.

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఆహార్యం అందరినీ ఆకట్టుకుంది. తెల్లని పైజమా.. లేత నేవీ బ్లూ ఆఫ్‌ హ్యాండ్స్‌ కుర్తా వేసుకొని ఆకర్షణీయంగా కనిపించారు. ఆయన సంప్రదాయ దుస్తులనే ధరించినప్పటికీ, ఆద్యంతం తన హుందాతనంతో, హావభావాలతో అలరించారు.

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

అయితే గజ్వేల్‌ పర్యటన సమయంలో బాగా వీచిన గాలికి జుట్టు రేగిపోవడంతో కాస్తంత ఇబ్బంది పడ్డట్టు కనిపించారు. పదేపదే తలపై చేయి పెట్టి జుట్టును సరిచేసుకున్నారు. ప్రసంగ సమయంలో కూడా చాలాసార్లు ఈ దృశ్యం కనిపించింది.

 గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ప్రకృతి కూడా తనవంతు సహకరించింది. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వర్షం వల్ల ఏమైనా ఆటంకాలు కలుగుతాయా ? అని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒకింత ఆందోళన చెందారు.

 గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

గజ్వేల్ సభలో నోరు జారిన ప్రధాని మోడీ

వర్షం వచ్చినప్పటికీ, ఎలాంటి ఇబ్బంది లేకుండా కోమటిబండలో రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేశాయి. వర్షం వచ్చినా తట్టుకునేలా వేదికలను సిద్ధం చేశాయి. అయితే ప్రధాని రాష్ట్రంలో అడుగుపెట్టడం మొదలు.. తిరిగి వెళ్లే వరకు వాతావరణం అనుకూలించింది. దీంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.

English summary
Prime Minister Narendra Modi has reached Telangana where he will inaugurate various projects including a thermal power plant. The prime minister will lay the foundation stone of 1st phase of NTPC Super Thermal Power Project in Medak during the visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X