లవర్‌ను తిట్టాడని చంపేశాడు: ఏడాదిగా పోలీసులకు చుక్కలు, చివరికిలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

వరంగల్: తన లవర్‌ను తిట్టాడనే కోపంతో ప్రేమికుడు ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఏడాది కాలంగా ఈ హత్య కేసును చేధించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. టెక్నాలజీ సహయంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడిని గుర్తించేందుకు లక్షలాది ఫోన్ ‌కాల్స్‌ను విశ్లేషించారు. ఏడాది తర్వాత అసలు నిందితుడిని గుర్తించారు. ఎట్టకేలకు వరంగల్ జిల్లా మడికొండ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

తన లవర్‌ను తిట్టాడనే కోపంతో ఓ వ్యక్తిని అత్యంత పకడ్బందీగా చంపాడు రాంకీ అనే యువకుడు. అయితే ఈ హత్య తాను చేసినట్టు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. కనీసం ఒక్క క్లూ కూడ లభ్యం కాకుండా జాగ్రత్తలు తీసుకొన్నాడు.

ఈ జాగ్రత్తల కారణంగా చందు హత్య కేసు మర్డర్ ఏడాది కాలంగా తేలలేదు. చందును ఎవరు హత్య చేశారనే విషయమై పోలీసులు తలలు బద్దలుకొట్టుకొన్నారు. అంతేకాదు టెక్నాలజీని ఉపయోగించి పరిశోధించారు.అయితే ఎట్టకేలకు నిందితుడు రాంకీని గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే నిందితుడిని గుర్తించేందుకు పోలీసులకు ఏడాది సమయం పట్టింది.

ఏడాది క్రితం చందు హత్య

ఏడాది క్రితం చందు హత్య

2016 సెప్టెంబర్‌ 14న భట్టుపల్లి కోటచెరువు దగ్గర జరిగిన పులిగిల్ల చందు (19) హత్యకు గురయ్యాడు. గత ఏడాది వినాయక నిమజ్జనం రోజున కాజీపేట మండలం భట్టుపల్లి కోట చెరువు వద్ద చందు హత్య జరిగింది. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఘటనా స్థలంలో పోలీసులకు లభించలేదు.టెక్నాలజీ సహయంతో అసలు నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.

లవర్‌ను తిట్టాడని హత్య చేశాడు

లవర్‌ను తిట్టాడని హత్య చేశాడు

తన లవర్‌ను తిట్టిన వ్యక్తిని ఓ ప్రేమికుడు దారుణంగా హత్య చేశాడు. హత్య జరిగిన స్థలంలో ఒక్క క్లూ కూడా లభించకుండా జాగ్రత్త పడ్డాడు. వర్ధన్నపేటకు చెందిన రెడ్డిమల్ల రాంకీ, పాలకుర్తిలో ఇరిగేషన్‌ శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. దర్గా కాజీపేటలో ఉండే అతడి బావ కనుమల్ల కిరణ్‌ ఇంటికి వచ్చే క్రమంలో అక్కడే ఉండే ఓ యువతితో రాంకీ ప్రేమలో పడ్డాడు. వినాయక నిమజ్జనం రోజున నిర్వహించిన కార్యక్రమంలో రెడ్డిమల్ల రాంకీ అతడి లవర్‌ ఇద్దరూ కలిసి డ్యాన్స్‌ చేశారు. అక్కడే ఉన్న పులిగిల్ల చందు రాంకీ లవర్‌ను కామెంట్‌ చేశాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. చందును పథకం ప్రకారం హత్య చేశాడు రాంకీ.

పథకం ప్రకారం చందు మర్డర్

పథకం ప్రకారం చందు మర్డర్

దర్గా కాజీపేటలో ఉండే గుగులోతు శివ అనే తన స్నేహితుడి ద్వారా పుల్లిగిల్ల చందును పిలిచాడు రాంకీ. ముగ్గురు కారులో వర్ధన్నపేట వరకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ముగ్గురూ మద్యం సేవించారు. అనంతరం కారు నడుస్తుండగానే రెడ్డిమల్ల రాంకీ తనతో తెచ్చుకున్న పదునైన ఇనుప చువ్వతో చందు మెడ, గొంతు భాగంలో విచక్షణరహితంగా పొడిచి చంపాడు. చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత భట్టుపల్లి కోటచెరువు మత్తడి పక్కనే ముళ్ల పొదల్లో మృతదేహాన్ని పడేసి వెళ్లారు.

పోలీసులు నిందితుడిని పట్టుకొన్నారిలా

పోలీసులు నిందితుడిని పట్టుకొన్నారిలా

చందు హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ కేసులో ఒక్కో చిక్కుముడి విప్పుతూ నిందితులను పట్టుకున్నారు. ముందుగా 2016 సెప్టెంబర్‌ 14న దర్గా కాజీపేటలో ఉన్న సెల్‌ఫోన్‌ టవర్ల పరిధిలో వచ్చి పోయిన కాల్స్‌ వివరాలు సేకరించారు. ఇందులో అనుమానాస్పదంగా అనిపించిన 12 మందిని గుర్తించి, అనుమానితుల కాల్‌ డేటా రికార్డు (సీడీఆర్‌) జాబితా ఆధారంగా విచారణ చేపట్టగా వారికి ఈ కేసుతో ఏ సంబంధం లేదన్నట్లు తేల్చారు.టవర్‌ లొకేషన్‌ టెక్నాల జీ సహయంతో నిందితులను పోలీసులు గుర్తించారు.హత్య జరిగిన సమయంలో, ఘటనా స్థలానికి కేవలం 200 మీటర్ల దూరంలో కేవలం గుగులోతు శివ అనే వ్యక్తి ఫోన్‌ సిగ్నల్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శివను అదుపులోకి తీసుకుని విచారించడగా తానూ, తన స్నేహితుడు రెడ్డిమళ్ల రాంకీ కలిసి ఈ హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Warangal police arrested Shiva and Ramky for Chandu murder case.Chandu was murdered on 2016 sep 14.Chandu was vulgar comments on Ramky lover at Ganesh immersion.Then Ramky murdered Chandu with the help of Shiva.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి