సెల్పీ దిగి వేధింపులకు పాల్పడ్డాడు, బాధితురాలు ఏం చేసిందంటే?
క్లాస్ మేట్ తో సెల్పీ దిగి, ఈ సెల్పీను అడ్డుపెట్టుకొని పెళ్ళిచేసుకోవాలని వేధిస్తున్న యువకులను హైద్రాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు.మరో యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.
హైదరాబాద్: క్లాస్ మేట్ తో సెల్పీ దిగి, ఈ సెల్పీను అడ్డుపెట్టుకొని పెళ్ళిచేసుకోవాలని వేధిస్తున్న యువకులను హైద్రాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు.మరో యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.
హైద్రాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, కొత్త పేట మహాలక్ష్మీనగర్ కాలనీకి చెందిన జొన్న వెంకటనాగసాయికృష్ణగౌడ్ తన క్లాస్ మేట్ తో రెండేళ్ళ క్రితం పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ కలిసి సెల్పీ తీసుకొన్నారు.

అయితే ఈ యువతితో సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకొన్న నాగసాయికృష్ణగౌడ్ తనను పెళ్ళిచేసుకోవాలంటూ ఆ యువతిని వేధించేవాడు.అయితే ఆ యువతి మాత్రం ఇందుకు నిరాకరించింది. తనను పెళ్ళిచేసుకోవాలని కోరినా నిరాకరించడంతో ఆమెపై కక్షను పెంచుకొన్నాడు ఆ యువకుడు.
ఆ యువతితో కలిసి దిగిన సెల్పీ ఫోటోలను మన్సూరాబాద్ సహారా ఏస్టేట్ లో ఉంటున్న సిరనగండ్ల ప్రదీప్ కుమార్ ,రఘువీర్ లకు పంపాడు. దీంతో వీరిద్దరూ కూడ ఈ యువతిని వేధింపులకు గురిచేశారు.
ఈ వేధింపులను ఆ యువతి తల్లిదండ్రులకు వివరించింది. కుటుంబసభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోలీసులు జొన్న వెంకటసాయికృష్ణగౌడ్ , సిరసనగండ్ల ప్రదీప్ కుమార్ లను అదుపులోకి తీసుకొన్నారు పోలీసులు. మరో యువకుడు బిన్ని పరారీలో ఉన్నట్టు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications