ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య: అసలేం జరిగింది?
తనను చేయని నేరానికి బలిపశువును చేశారంటూ ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు అతడు ఓ వీడియో రికార్డు చేసి తన ఆత్మహత్యకు కారణమైన అధికారుల పేర్లను తెలిపాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఏనుకూరుకు చెందిన సాగర్ బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా సాగర్ విధులు నిర్వహించాడు.
గతంలో బూర్గంపాడుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, అప్పటి ఎస్‌ఐతో సన్నిహితంగా ఉండి గంజాయి పక్కదోవపట్టించినట్టు ప్రచారం జరిగింది. ఈ గంజాయి కేసుకు సంబంధించి లావాదేవీలన్నీ సాగర్ సెల్‌ఫోన్ ద్వారా మాట్లాడే వారని తెలిసింది. అయితే, గంజాయి స్మగ్లింగ్ కేసులో సాగర్‌ను పోలీసు అధికారులు 8 నెలల క్రితం సస్పెండ్ చేశారు.

చేయని తప్పునకు తనకు శిక్ష పడిన విషయంపై సాగర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పటి ఎస్‌ఐ బదిలీ అయిన తర్వాత ఎస్‌ఐగా వచ్చిన వారు వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని అమ్ముకొని తనను బలి పశువును చేశారంటూ సాగర్ సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి మరీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తాను చేయని నేరానికి తనకు శిక్ష పడిన విషయంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యాను అని వీడియోలో సాగర్ తెలిపాడు. తనకు న్యాయం జరగదేమోననే ఆలోచనలో ఆత్మ హత్యాయత్నం చేశాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, సాగర్ సస్పెన్షన్ వ్యవహారం, ఇప్పుడు అతను ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంజాయి పక్కదోవ పట్టిన కేసులో అసలు ముద్దాయిలు ఎవరో తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సాగర్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అతడి కుటుంబసభ్యులు కోరుతున్నారు.
తుపాకీతో కాల్చుకుని మరో కానిస్టేబుల్ సూసైడ్
మరో ఘటనలో మహబూబూబాద్ జిల్లాలో ఏర్ కానిస్టేబుల్ జీ శ్రీనివాస్ తన తుపాకీతో కాల్చుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్.. ఆదివారం సాయంత్రం తన వద్దనున్న గన్‌తో కాల్చుకున్నాడు. పేలుడు శబ్జం రాగానే హుటాహుటిన పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకోగా.. అప్పటికే రక్తపు మడుగులో కానిస్టేబుల్ విగత జీవిగా పడివున్నాడు.
సమాచారం అందుకున్న వెంటనే మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ డేవిడ్‌లు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్.. గత ఐదు సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. భార్యాబిడ్డలకు దూరమయ్యానన్న దిగులుతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తిరుపతి రావు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications