ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మ‌ళ్లీ ఒకే ఒర‌లో రెండు క‌త్తులు..! ఖ‌మ్మం జిల్లాలో గులాబీ ఉనికి కి మ‌రింత ప్ర‌మాద‌మేనా..?

|
Google Oneindia TeluguNews

ఖ‌మ్మం/హైదరాబాద్: టీడీపీ సీనియర్ నాయకుడు నామా నాగేశ్వర్ రావు టీఆర్ఎస్ లో చేరారు. క్యాంప్ కార్యాల‌యంలో కేటీఆర్ సమక్షంలో నామా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ పార్టీలోకి వివిధ పార్టీలకు చెందిన నేతలు భారీగా వలసలు పెరిగాయి. నామా నాగేశ్వర్‌రావుకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత కొద్ది రోజులుగా నామా టీఆర్ఎస్ పార్టీలో చేరతారనే వార్తలు విన్పించాయి.

ఎన్నికల స్టంటే : ఆ ఘనత మీది కాదు ..? టెలిగ్రాఫ్ రిపోర్టర్‌దేనన్న విపక్షాలు ఎన్నికల స్టంటే : ఆ ఘనత మీది కాదు ..? టెలిగ్రాఫ్ రిపోర్టర్‌దేనన్న విపక్షాలు

ఖ‌మ్మం జిల్లాలో వ‌ర్గ‌పోరుకు సై అన్న‌ నామా, తుమ్మ‌ల‌..! ఇప్పుడు గులాబీకి ప్ల‌స్సా..? మైన‌స్సా..?

ఖ‌మ్మం జిల్లాలో వ‌ర్గ‌పోరుకు సై అన్న‌ నామా, తుమ్మ‌ల‌..! ఇప్పుడు గులాబీకి ప్ల‌స్సా..? మైన‌స్సా..?

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి నామా అత్యంత సన్నిహితంగా మెలిగారు. నగరంలో ఫ్లైఓవర్ ప్రాజెక్టులతో పాటు, నీటి పారుదల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం పనులు అప్పగించారు. తెలంగాణలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థంగా మారడంతో నామా సైతం టీఆర్ఎస్ పార్టీలో చేరక తప్పలేదు. నామాతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. ఇంత‌వ‌ర‌కూ క‌థ సుఖాంతంగా క‌నిపిస్తున్నా అస‌లు ట్విస్తు ఇక్క‌డే మొద‌ల‌వుతోంది.

ఖ‌మ్మం జిల్లాలో గులామీ బ‌ల‌హీనం..! ప్ర‌త్యేక ద్రుష్టి పెట్టిన కేసీఆర్..!!

ఖ‌మ్మం జిల్లాలో గులామీ బ‌ల‌హీనం..! ప్ర‌త్యేక ద్రుష్టి పెట్టిన కేసీఆర్..!!

ఖ‌మ్మం జిల్లాలో గులాబీ పార్టీ ప‌ట్టు సాధించేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖర్ రావు మొద‌టినుండి ప్ర‌య‌త్నిస్తూ వ‌స్తున్నారు. అన్ని జిల్లాల్లో పార్టీని ఓ కొలిక్కి తెచ్చిన చంద్ర‌శేఖ‌ర్ రావు ఖ‌మ్మం జిల్లాలో మాత్రం ఆదిప‌త్యాన్ని కూడ‌గ‌ట్ట‌లేక పోయారు. అందుకోసం టీడిపి నేత తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావును పార్టీలోకి తీసుకొచ్చి, ఎమ్మెల్సీని చేసి మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి జిల్లా బాద్య‌త‌ల‌ను క‌ట్ట బెట్టారు చంద్ర‌శేఖ‌ర్ రావు.

నామా పై గంపెడాశ‌లు పెట్టుకున్న కేసీఆర్..! పార్టీలో ఐక్య‌తా రాగం వినిపిస్తుందా..??

నామా పై గంపెడాశ‌లు పెట్టుకున్న కేసీఆర్..! పార్టీలో ఐక్య‌తా రాగం వినిపిస్తుందా..??

తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు జిల్లాలో పార్టీ ప‌టిష్ట‌త కోసం ఏం చేసారో తెలియ‌దు గాని తెలంగాణ ముంద���స్తు ఎన్నిక‌ల్లో అనుకున్న ఫ‌లితాలు రాలేదు. పైగా తుమ్మ‌ల కూడా ఓడిపోయారు. దీంతో ఖ‌మ్మం జిల్లా మీద ప్ర‌త్యేక ద్రుష్టి కేంద్రీకరించిన చంద్ర‌శేఖ‌ర్ రావు టీడిపి మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర రావును పార్టీలోకి ఆహ్వానించి ఖ‌మ్మం లోక్ స‌భ సీటును కేటాయించారు. ఐతే తెలుగుదేశం పార్టీలో ఉన్న‌ప్ప‌టి నుండీ వ‌ర్గ రాజ‌కీయాలు న‌డిపిన తుమ్మ‌ల, నామా రాజ‌కీయాలు ఇప్పుడు జిల్లాలో ఏక‌తాటిపై��ి వ‌స్తాయా అన్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

టీడిపిని రెండు సార్లు కుదేలు..! నామా, తుమ్మ‌ల మ‌ద్య గులాబీ విక‌సిస్తుందా..న‌లుగుతుందా..?

టీడిపిని రెండు సార్లు కుదేలు..! నామా, తుమ్మ‌ల మ‌ద్య గులాబీ విక‌సిస్తుందా..న‌లుగుతుందా..?

ఆదిప‌త్య రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతూ తెలుగుదేశం పార్టీ ఓట‌మికి కారుకుల‌య్యార‌ని 2009, 2014లో అప‌వాదును మూట‌గ‌ట్టుకున్న ఈ నేత‌లు ఇప్పుడు ఒకే గొడుగు కింద‌కి చేరారు. ఇప్పుడు కూ��ా అవే రాజ‌కీయాలు నెర‌పుతారా? లేక పార్టీ ప‌టిష్ట‌త‌కు క్రిషి చేస్తారా ? అని జిల్లాలో చ‌ర్చించుకుంటున్నారు. ఎంతైనా ఒక ఒకర‌లో రెండు క‌త్తులను ఇమ‌డ‌లేవ‌నే సామెత‌కు విరుద్దంగా తెలంగాణ ద‌ళ‌ప‌తి చేసిన ప్ర‌య‌త్నం జిల్లాలో ఎంత‌వ‌ర‌కు సానుకూల ఫ‌లితాన్నిస్తుందో అనే అంశం పై చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
TDP senior leader Nama Nageshwar Rao joined the TRS. In the presence of KTR. in the Camp Office, With Nama, different parties have grown immigrants in the TRS party as elections are approaching. cm kcr expecting party should strengthen in Khammam district with the entry of Nama nageshvar rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X